Allu Arjun: విచారణ కోసం పోలీస్ స్టేషన్ హాజరైన అల్లు అర్జున్
ABN , Publish Date - Dec 24 , 2024 | 10:53 AM
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్, సంధ్య థియేటర్ వివాదంలో విచారణకు హాజరయ్యారు. ఆయన లాయర్ సహా పలువురితో కలిసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు బయలుదేరారు.
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) సంధ్య థియేటర్ వివాదం నేపథ్యంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు విచారణ కోసం హాజరయ్యారు. సంధ్య థియేటర్ ఘటన ఇటీవల వివాదాలకు దారి తీసింది. విచారణలో భాగంగా అల్లు అర్జున్ తన ఇంటి నుంచి లాయర్ సహా పలువురితో కలసి స్టేషన్‌కు బయలుదేరారు.