Hamas: తల్లుల గర్భశోకం..దయలేని లోకం
ABN, Publish Date - Aug 01 , 2024 | 07:44 PM
హమాస్ నాయుకుడు ఇస్మాయిల్ హనియాను ఆయన బస చేసిన ప్రాంతంలో రాకెట్‌తో హత్య చేశారు. ఇది దుర్మార్గమైన యూదు ఉన్మాద హత్య అని హమాస్ చెబుతోంది. ఇంకా ఒప్పుకోలేదు కానీ ఇది ఇజ్రాయిల్ చేసిన హత్య అని తెలిసిపోతుంది.
హమాస్ నాయుకుడు ఇస్మాయిల్ హనియాను ఆయన బస చేసిన ప్రాంతంలో రాకెట్‌తో హత్య చేశారు. ఇది దుర్మార్గమైన యూదు ఉన్మాద హత్య అని హమాస్ చెబుతోంది. ఇంకా ఒప్పుకోలేదు కానీ ఇది ఇజ్రాయిల్ చేసిన హత్య అని తెలిసిపోతుంది. ప్రపంచంలో చెడును తగ్గించడానికి ఇదే సరైనా పద్ధతి అని ఇజ్రాయిల్ మంత్రి ఒకరు ట్వీట్ చేశారు. పాలస్తీనా పోరాటం చర్రితలో ఇటువంటి హత్యలు పెద్ద ఆశ్చర్యం ఏమి కావు. కానీ ఇలాంటి ఘోర విరుపు అంతర్జాతీయ సమాజాన్ని ఖాతరు చేయని తనం మాత్రం పశ్చిమ ఆసియా సంఘర్షణలోనే కాదు ప్రపంచమంత పెరిగిపోతున్న ధోరణి. ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసూద్ పేజిస్ కియాన్ ప్రమాణ స్వీకారానికి అని హని ఇరాన్ వెళ్లారు. ఇండియా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో పాటు హనీ కూడా ఆ వేడుకల్లో పాల్గొన్నారు.
ప్రమాణ స్వీకారం తర్వాత అర్ధరాత్రి ఈ హత్య జరిగింది. ఓ పక్క శాంతి చర్చలు జరుగుతుండగా ఈ ఎన్నికల్లో సైతం పాలస్తీనా సమస్య ప్రముఖ అంశంగా పరిగణిస్తుండగా ఈ హత్య జరిగింది. దీనికి గొలుసుకట్టు పర్యవసానాలు అనేకం ఉంటాయి. ఈ ఏడు గ్లోబల్ రాజకీయాలు మరింత ఉద్రిక్తం కానున్నాయి. చంపుతామని ఇజ్రాయిల్ ముందే చెప్పింది. చిట్టచివరి హమాస్ సభ్యుడిని చంపే వరకు వదిలిపెట్టబోమని చెబుతునే ఉంది. ఇక అధినేతను వదులుతుందా..? ఏ టర్కీ, ఖతార్‌లోనో ఉండగా పంపవచ్చు కదా..? ఎందుకు చేయలేదు. గత ఏడాది అక్టోబర్ 7 నాడు హమాస్ చేసిన హత్యకాండ వెనుక ఇరాన్ దన్ను ఉందని ఇజ్రాయిల్‌కు ప్రపంచానికి కూడా తెలుసు. ఇరాన్ గడ్డ మీదనే హమాస్ నేతను చంపి చూపించాలని ఇజ్రాయిల్ అనుకుంది. గుస్ గుస్ కే మారా అని తన గురించి నాయకుడు.. నాయకుడు గురించి ప్రజలు గర్వంగా చెప్పుకుంటున్న రోజుల్లో ఇజ్రాయిల్ చర్య సాహోసోపేతమైన ఆనవాళ్లుగా కనిపించడంతో ఆశ్చర్యం లేకపోలేదు.
ఇజ్రాయిల్ మొదటి నుంచి దాదాపు ఇంతే. 1948, 1967లో కూడా ఆ దేశానిది కృరమైన టెంపరి తనమే. ఐక్యరాజ్య సమితి. ప్రపంచ దేశాల అభిప్రాయాలు లెక్కచేయకపోవడమే దాని నైజం. అప్పుడప్పుడు మాట వరుసకు పాలస్తీనాకు న్యాయం గురించి రెండు దేశాల పరిష్కారం గురించి మాట్లాడుతూ చేతల్లో మాత్రం ఇజ్రాయిల్‌ను పెంచి పోషించింది అమెరికానే. సోవియట్, రష్యా విచ్ఛిన్నమైనా తర్వాత ఇజ్రాయిల్ ప్రాధాన్యం దుందుకుడు తనం మరింత పెరిగాయి. ఓస్లో ఒప్పందం ద్వారా రెండడుగులు కిందికి పాలస్తీనా ఉద్యమం రెండడుగులు వెనక్కు వెళ్లానా ఇజ్రాయిల్ దానిని గౌరవించలేదు. మొత్తంగా దేశమంతటినీ యూదుల సెంటిమెంట్‌లతో నింపేసి పాలస్తీనా జీవితాలను అతి చిన్న భూభాగంలో శరణార్థి శిబిరాలకు లేదా కిక్కిరిసినా జనావాసాలకు పరిమితం చేయడం దాని లక్ష్యంగా ఉంది.
ఇజ్రాయిల్ దక్షిణ సరిహద్దులో ఉన్న ఏడారి ప్రాంతంలోకి గాజా వాసులను పూర్తిగా తరిమేసి వారిని అక్కడే ఉంచడం పరిష్కరించడమన్న జియోనిస్టుల ప్రతిపాదనకు ట్రంప్ ప్రభుత్వం వంతపాడింది కూడా. మరో పక్క ఆరంభం నుంచి పాలస్తీనా పక్షన ఉన్న దేశాలు ఒక్కొక్కటిగా జారిపోవడం మొదలుపెట్టాయి. చిట్టచివరిగా సౌదీ అరేబియా కూడా ఇజ్రాయిల్‌తో సంబంధాలు పెట్టుకోబోతునప్పుడు దానిని నివారించడానికి హమాస్ గత అక్టోబర్‌లో హంతక దాడులు చేసింది. హమాస్ 11 వందల మంది ఇజ్రాయిలీలను చంపగా అందుకు ప్రతీగా యుద్ధంలో 40 వేల మంది పాలస్తీనియన్లను ఇజ్రాయిల్ చంపింది. ఈ లెక్క ఇంకా పెరుగుతోంది. హనియే హత్య తర్వాత ఏం జరుగుతోంది. ఈ ఘాతుకానికి జవాబు తప్పక ఇస్తామని హమాస్ సహజంగానే అంటుంది. ఇరాన్ కూడా బాధ్యులను కనుగొని చర్యలు తీసుకుంటామని చెప్పింది. హమాస్ ఎంత ప్రతికూల ప్రచారానికి లోనయింది అంటే ఈ చర్యను నేరుగా ప్రపంచ నేతల్లో చాలామందికి నోరు రావడం లేదు. ఒకపక్క చర్చలు జరుగుతుండగా ఇదేంటని శాంతిప్రక్రియలో పాలు పంచుకుంటున్న ఖతార్ బాధపడింది. చైనా మాత్రం హత్యను తీవ్రంగా ఖండిస్తూ తక్షణం కాల్పుల విరమణ జరగాలని కోరింది.
Updated at - Aug 01 , 2024 | 07:44 PM