శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్
ABN, Publish Date - Nov 24 , 2024 | 09:03 PM
నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆదివారం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కార్తిక మాసం ముగియనుండంతోపాటు ఆదివారం సెలవు దినం కావడంతో.. శ్రీశైలానికి భక్తులు భారీగా పోటెత్తారు. దీంతో దాదాపు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలు క్లియర్ చేసేందుకు పోలీసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆదివారం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కార్తిక మాసం ముగియనుండంతోపాటు ఆదివారం సెలవు దినం కావడంతో.. శ్రీశైలానికి భక్తులు భారీగా పోటెత్తారు. దీంతో దాదాపు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలు క్లియర్ చేసేందుకు పోలీసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. శ్రీశైలం వచ్చిన పలు వాహనాలు తిరిగి వెళ్లే క్రమంలో ఘాట్ రోడ్లపై రిపేర్లు కావడంతో.. ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో రహదారులపై నుంచి వాటిని పక్కకు తీసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. మరోవైపు శ్రీశైలం టోల్ గేట్, సాక్షి గణపతి, హఠకేశ్వరం, ముఖద్వారం వరకు భారీగా వాహనాలు రహదారిపై నిలిచిపోయాయి.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated at - Nov 24 , 2024 | 09:03 PM