Jani Master: జానీ మాస్టర్ సుద్దపూస కాదు! కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్

ABN, Publish Date - Sep 19 , 2024 | 05:35 PM

స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ ఉదంతంపై సినీ నటి కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్ చేశారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధితురాలు మహిళ కమిషన్‌కు కూడా వెళ్లడం.. తర్వాత ఆమె చెప్పిన విషయాలు వింటే జానీ మాస్టర్ సుద్దపూస కాదని అర్ధం చేసుకోవచ్చని అన్నారు.

హైదరాబాద్: స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ ఉదంతంతో టాలీవుడ్‌లో మరోసారి లైంగిక వేధింపులు బయటకు వచ్చాయి. ఈ విషయంపై సినీ నటి కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్ చేశారు. జానీ మాస్టర్ గురించి ఇలాంటి విషయం బయటకు వచ్చిదంటే నమ్మలేకపోయానని అన్నారు. ఆయన అందరితో మంచిగా ఉండేవారని తెలిపారు. కోల్‌కతా వైద్యురాలిపై అత్యాచార ఘటనను ఖండిస్తూ హైదరాబాద్‌లో టాలీవుడ్ నటులతో కలిసి క్యాండిల్ ర్యాలీ చేశామని అన్నారు.


ఈ కార్యక్రమంలో జానీ మాస్టర్, కొంతమంది కొరియోగ్రాఫర్‌లు కూడా పాల్గొన్నారని చెప్పారు. ఆరోజు ర్యాలీలో వైద్యురాలికి మద్దతుగా నిలబడిన వ్యక్తిపై మహిళల వేధించారనే ఆరోపణలు రావడం నమ్మలేకపోతున్నానని అన్నారు. ఓ వైపు బాధగా కూడా ఉందని చెప్పారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధితురాలు మహిళ కమిషన్‌కు కూడా వెళ్లడం.. తర్వాత ఆమె చెప్పిన విషయాలు వింటే జానీ మాస్టర్ సుద్దపూస కాదని అర్ధం చేసుకోవచ్చని అన్నారు. అయితే ఇంతకాలం నుంచి ఆయనను వదిలేసి.. ఈ మధ్యకాలంలో వీరి మధ్య గొడవలు ఏమైనా జరిగిందా అనే అనుమానాలు ఉన్నాయని కరాటే కళ్యాణి వెల్లడించారు.

Updated at - Sep 19 , 2024 | 05:40 PM