Revanth Reddy: సీఎంతో సినీ ప్రముఖుల భేటీ విజువల్స్ చుశారా..
ABN , Publish Date - Dec 26 , 2024 | 12:23 PM
సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల సినీ ప్రముఖులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్, టికెట్ ధరల పెంపు, ప్రభుత్వ అనుమతులు, శాంతి భద్రతలపై వివిధ సూచనలు చేశారు. నాగార్జున సహా పలువురు ప్రముఖులు తమ సూచనలను సీఎం ముందు ఉంచారు.
తెలుగు సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తాజాగా సినీ ప్రముఖులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం తన ప్రతిపాదనలను పరిశ్రమ పెద్దలకు సూచించారు. అందులో ముఖ్యంగా యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్‌లో సహకరించాలని, సినిమా ప్రచార కార్యక్రమాలలో హీరోలే పాల్గొనాలని, టికెట్ల ధరలపై ప్రత్యేక సెస్ విధించి ఆ మొత్తాన్ని విద్యా కార్యక్రమాలకు వినియోగించాలనట్లు సూచించారు. అలాగే టికెట్ల ధరల పెంపు, బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలపై ప్రభుత్వ అనుమతి ఉండకూడదని పేర్కొన్నారు.
ఈ భేటీలో కులగణన సర్వే గురించి ప్రచారం చేయాలని, ప్రభుత్వ పనులకు ఇండస్ట్రీ సహకారం ఇవ్వాలని, ర్యాలీలు నిషేధించాల్సిన అవసరం ఉందని, అలాగే శాంతి భద్రతల విషయంలో రాజీ పడకూడదని సీఎం తెలిపారు. బౌన్సర్లపై చర్యలు తీసుకోవాలని, అభిమానులను కంట్రోల్ చేయడంలో సెలబ్రిటీల బాధ్యత ఎక్కువ అని ప్రస్తావించారు. ఈ క్రమంలో దీనికి ముందు నాగార్జున, వెంకటేష్ సహా పలువురు సీఎం రేవంత్ రెడ్డికి శాలువా కప్పారు.
ఇవి కూడా చదవండి...
Tollywood Meet: సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖుల భేటీ.. లైవ్ వీడియో
Film Industry: సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ.. ఇందుకేనా..
నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
నేడు కర్ణాటకకు రేవంత్.. విషయం ఇదే..
Read Latest Telangana News And Telugu News