KTR: ఇంట్లో పార్టీ చేసుకుంటే తప్పా..
ABN , Publish Date - Oct 28 , 2024 | 02:02 PM
తెలంగాణ ప్రభుత్వం, పోలీసుల వైఖరిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పు పట్టారు. ఇంట్లో పార్టీ చేసుకుంటే తప్పు చేసినట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
హైదరాబాద్: ఇంట్లో దావత్ చేసుకుంటే తప్పా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. జన్వాడ ఫామ్ హౌస్‌లో కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల విందుపై దుమారం చెలరేగింది. ఆ విందులో రాజ్ పాకాల అండ్ కో డ్రగ్స్ తీసుకున్నారని పోలీస్ అధికారులు చెబుతున్నారు. ఇదే అంశంపై కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఇంట్లో పార్టీ చేసుకోవడం తప్పా.. నేరం, ఘోరం చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాజకీయ కక్షసాధింపులో భాగమే పోలీసుల సోదాలు అని విమర్శించారు.