Share News

Amaravati: అమరావతి రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్

ABN , Publish Date - Oct 24 , 2024 | 03:34 PM

అమరావతి రైల్వే లైన్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 57 కిలోమీటర్ల పొడవున కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి అంగీకరించింది.

Amaravati:  అమరావతి రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్
Amaravati Railway Line

ఢిల్లీ: అమరావతి రైల్వే లైన్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 57 కిలోమీటర్ల పొడవున కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి అంగీకరించింది. రూ.2,245 కోట్లతో రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనుంది. ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు కొత్త లైన్ నిర్మించనుంది. అమరావతి నుంచి హైదరాబాద్‌, చెన్నై, కోల్‌కతాకు నేరుగా అనుసంధానిస్తూ కొత్త లైన్‌ నిర్మిస్తారు. దీంతో దక్షిణ భారతదేశాన్ని మద్య, ఉత్తర భారతంతో అనుసంధానం చేయడం మరింత సులువు అవుతుంది. ఈ మార్గం అమరలింగేశ్వర స్వామి, అమరావతి స్థూపం, ధ్యానబుద్ద, ఉండవల్లి గుహల మీదుగా వెళుతుంది. మచిలీపట్నం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులకు అనుసంధానిస్తారు. రైల్వే లైన్‌ నిర్మాణం ద్వారా కూలీలకు 19 లక్షల రోజుల ఉపాధి లభించనుంది. రైల్వే లైన్‌ నిర్మాణంతో పాటు కాలుష్య నివారణకు చర్యలు చేపట్టారు. 25 లక్షల మొక్కలు నాటుతారు. కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జ్‌ నిర్మాణం చేపడుతారు. రైల్వేశాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడా లైవ్ చుద్దాం. పదండి.

Updated Date - Oct 24 , 2024 | 03:49 PM