Hemant Soren: సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణం
ABN , Publish Date - Nov 28 , 2024 | 11:22 AM
జార్ఖండ్ రాష్ట్రానికి హేమంత్ సోరెన్ నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 2013లో తొలిసారి సీఎం పదవి పగ్గాలు చేపట్టారు. గత ఏడాది మనీ లాండరింగ్ ఆరోపణలు రావడం, ఈడీ అరెస్ట్ చేయడంతో హేమంత్ సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ కేసులో బెయిల్ రావడంతో బయటకు వచ్చారు. సీఎం పదవి బాధ్యతలను స్వీకరించారు.
జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. రాంచీలో గల మొరాబాది గ్రౌండ్‌లో సాయంత్రం 4 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత మంత్రులు ప్రమాణం చేస్తారని తెలిసింది. జార్ఖండ్ రాష్ట్రానికి హేమంత్ సోరెన్ నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 2013లో తొలిసారి సీఎం పదవి పగ్గాలు చేపట్టారు. గత ఏడాది మనీ లాండరింగ్ ఆరోపణలు రావడం, ఈడీ అరెస్ట్ చేయడంతో హేమంత్ సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ కేసులో బెయిల్ రావడంతో బయటకు వచ్చారు. సీఎం పదవి బాధ్యతలను స్వీకరించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సోరెన్ పార్టీ జేఎంఎం విజయం సాధించడంతో మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడుతున్నారు.