Basara: సరస్వతి దేవి ఆలయంలో చోరీ.. భద్రతా సిబ్బందిపై వేటు..
ABN, Publish Date - Aug 16 , 2024 | 05:48 PM
Basara Saraswathi Devi Temple: బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో రాత్రి సమయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. క్యూలైన్ మీదుగా నడుచుకుంటూ వచ్చిన దొంగ గోషాల పై నుంచి ఆలయంలోకి దిగాడు. దత్త మందిరం ముందున్న హుండీని పగలగొట్టి నగదును తీసుకున్నాడు.
Basara Saraswathi Devi Temple: బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో రాత్రి సమయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. క్యూలైన్ మీదుగా నడుచుకుంటూ వచ్చిన దొంగ గోషాల పై నుంచి ఆలయంలోకి దిగాడు. దత్త మందిరం ముందున్న హుండీని పగలగొట్టి నగదును తీసుకున్నాడు. అనంతరం ప్రధాన ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. గ్రిల్స్ బలంగా ఉండటంతో సాధ్యం కాలేదు. ఆ తరువాత ఆలయం వెనకున్న మరో హుండీని పగులగొట్టేందు ప్రయత్నించి విఫలమయ్యాడు. చీరల కౌంటర్లో రెండు బ్యాగ్‌లను ఎత్తుకెళ్లాడు. అక్కడే ఉన్న ప్రసాదాల కౌంటర్లో నగదు కోసం వెతికాడు. ఏమీ దొరక్కపోవడంతో కౌంటర్‌ను ధ్వంసం చేశాడు. గంటకు పైగా దొంగ అక్కడే తిరగడం విశేషం.
Updated at - Aug 16 , 2024 | 05:48 PM