Priyanka Gandhi: ప్రియాంక గాంధీ అను నేను..
ABN , Publish Date - Nov 28 , 2024 | 12:12 PM
వాయనాడు ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం చేశారు. చేతిలో రాజ్యాంగం పట్టుకొని మరీ ప్రమాణం చేశారు. ప్రియాంక గాంధీని పలువురు ఎంపీలు అభినందించారు.

ప్రియాంక గాంధీ వాద్రా అనే నేను.. లోక్ సభ సభ్యురాలిగా ఎన్నికైనందున చట్టం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగంపై నిజమైన విశ్వాసం, విధేయత కలిగి ఉంటానని ప్రమాణం చేశారు. ప్రియాంక ప్రమాణం చేసేందుకు డయాస్ పైకి రాగా.. కాంగ్రెస్ సభ్యులు గట్టిగా అరిచారు. వాయనాడు లోక్ సభ స్థానానికి రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. బై పోల్‌లో పోటీ చేసిన ప్రియాంక గాంధీ 4 లక్షల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు.