CM Revanth Reddy: పదిమందికి అన్నం పెడతారు.. నన్ను ఆదరించారు..
ABN , Publish Date - Jul 20 , 2024 | 01:59 PM
కమ్మ అంటే అమ్మలాంటి వారు అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు వ్యవసాయం చేసి, పది మందికి అన్నం పెడతారని వివరించారు. నేను ఎక్కడ ఉన్న కమ్మ వారు ఆదరిస్తారని వివరించారు.
హైదరాబాద్: కమ్మ అంటే అమ్మలాంటి వారు అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అభిప్రాయ పడ్డారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు వ్యవసాయం చేసి, పది మందికి అన్నం పెడతారని వివరించారు. నేను ఎక్కడ ఉన్న కమ్మ వారు ఆదరిస్తారని వివరించారు. అనర్గళంగా మాట్లాడటం దివంగత ఎన్టీఆర్ నుంచి నేర్చుకున్నానని వివరించారు. ఎన్టీఆర్ లైబ్రరీలో చదివిన తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని పేర్కొన్నారు. మాదాపూర్‌లో నిర్వహించిన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ మహాసభల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని, ప్రసంగించారు.