CM Chandrababu: బ్రాండ్ ఏపీ ముందుకెళ్తోంది
ABN , Publish Date - Jan 10 , 2025 | 02:55 PM
గుంటూరులో నరెడ్కో ప్రాపర్టీ షోను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని అన్ని రంగాలు పతనావస్థకు చేరాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గంటూరు, జనవరి 10: ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణ రంగం అభివృద్ధిపై దృష్టి సారించామని ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నిర్మాణ రంగంపై 34 లక్షల మంది ఆధారపడి ఉన్నారని తెలిపారు. ఉచిత ఇసుకతో నిర్మాణ రంగానికి ఊతమిచ్చామన్నారు. నిర్మాణ రంగం నిరంతరం జరిగే ప్రక్రియ అని సీఎం చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. నరెడ్కో, క్రెడాయ్ వంటి సంస్థలు ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపు నిచ్చారు.
రియల్ ఎస్టేట్ రంగంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు. వైసీపీ పాలనలో నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతిందని తెలిపారు. నిర్మాణ రంగానికి తాము ఊతమిచ్చామని ఆయన వివరించారు. శుక్రవారం గుంటూరులో నరెడ్కో ప్రాపర్టీ షోను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.
అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో అన్ని రంగాలు పతనావస్థకు చేరాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సమస్యల వలయంగా మార్చేశారంటూ గత ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పడకేసిన నిర్మాణ రంగాన్ని మళ్లీ పైకి తీసుకురావాల్సి ఉందన్నారు.
కొత్త ఏడాదిలో నిర్మాణ రంగం అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మాణ రంగం అధ్వానంగా ఉందని గుర్తు చేశారు. ప్రజలు తమను నమ్మి 93 శాతం స్ట్రైక్ రేట్‌తో భారీ విజయం కట్టబెట్టారన్నారు. అధికారంలోకి రాగానే రాష్ట్ర పునర్ నిర్మాణాన్ని ప్రారంభించామని ఆయన స్పష్టం చేశారు. అందులోభాగంగా రూ. 2 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ.. తాజాగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారని చెప్పారు. బ్రాండ్ ఏపీ ఇప్పుడిప్పుడే ముందుకెళ్తోందన్నారు. బ్రాండ్ ఏపీ ఇప్పుడిప్పుడే ముందుకెళ్తోందన్నారు.
భూ కబ్జాకారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా భూ సమస్యల దరఖాస్తులు తమకు వస్తున్నాయని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అక్రమాలే భూ సమస్యలకు ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. వైసీపీ నిర్వాకంతో టీడీఆర్ బాండ్లు తీసుకుని నష్టపోయారన్నారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంటు సాధన కోసం కృషి చేస్తున్నామని వివరించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత.. 4 లక్షల కోట్ల పెట్టుబడులకు సంతకాలు చేశామన్నారు. ఈ ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉపాధి కల్పించాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
For AndhraPradesh News And Telugu News