Share News

MLA : అంధత్వం శరీరానికే... మనస్సుకు కాదు

ABN , Publish Date - Jan 03 , 2025 | 12:22 AM

అంధత్వం శరీరానికి మాత్రమేనని, మనస్సుకు కాదని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ పేర్కొన్నారు. లూయిస్‌బ్రెయిలీ జయంతి సందర్భంగా జాతీయ అంధుల క్రీడా సమాఖ్య ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక కృష్ణకళామందిరంలో అంధుల క్రీడా పోటీలు నిర్వ హించారు. ఎమ్మెల్యేలు దగ్గుపాటి, ఎంఎస్‌ రాజు ముఖ్య అతిథులుగా హాజరై లూయీస్‌ బ్రెయిలీ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.

MLA : అంధత్వం శరీరానికే... మనస్సుకు కాదు
MLAs Daggupati and MS Raju are starting chess competitions for the blind

ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌

ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజుతో కలిసి అంధుల క్రీడా పోటీలు ప్రారంభం

అనంతపురం అర్బన/ క్లాక్‌ టవర్‌, జనవరి 2 (ఆంధ్రజ్యోతి) : అంధత్వం శరీరానికి మాత్రమేనని, మనస్సుకు కాదని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ పేర్కొన్నారు. లూయిస్‌బ్రెయిలీ జయంతి సందర్భంగా జాతీయ అంధుల క్రీడా సమాఖ్య ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక కృష్ణకళామందిరంలో అంధుల క్రీడా పోటీలు నిర్వ హించారు. ఎమ్మెల్యేలు దగ్గుపాటి, ఎంఎస్‌ రాజు ముఖ్య అతిథులుగా హాజరై లూయీస్‌ బ్రెయిలీ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంధుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చదరంగం క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఎమ్మెల్యేలు ప్రారంభించారు. అంధులతో కలిసి ఎమ్మెల్యేలు కొద్ది సేపు చెస్‌ ఆడి వారిని ప్రోత్సహించారు. కూటమి ప్రభుత్వంతోనే దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు సాధ్య మవుతాయని తెలి పారు. తెలుగు రా ష్ట్రాల నుంచి సు మారు 200 మందికి పైగా అంధ క్రీడాకారులు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు చెస్‌, అథ్లెటిక్స్‌, సాంస్కృ తిక పోటీలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాపుకార్పోరేషన మాజీ డైరెక్టర్‌ రాయల్‌మురళీ, క్రీడా సభ్యులు ఓబుళనాయుడు, అంధుల క్రీడాసమాఖ్య సభ్యులు విజయభాస్కర్‌, రవి, నాగశివారెడ్డి, నాగార్జున, ఎర్రిస్వామి, కుమార్‌ రాజా, అంధ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jan 03 , 2025 | 12:22 AM