MLA: వైసీపీ అసమర్థ పాలనకు సాక్ష్యం విరిగిన గేట్లు
ABN , Publish Date - Feb 18 , 2025 | 12:12 AM
వైసీపీ అసమర్థ పాలనకు సాక్ష్యం విరిగిన పేరూరు డ్యాం గేట్లే అని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఆమె సోమవారంమండలంలోని అప్పర్ పెన్నార్ (పేరూరు) డ్యాంను సందర్శించారు. మరమ్మతులకు గురైన డ్యాం గేట్లను పరిశీలించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... వర్షపు నీటితో జలాశయం నిండిన సమయంలో జాగ్రత్తలు తీసుకోకుండా, అవగాహన లేకుండా గేట్లు ఎత్తి వాటిని విరిగ్గొ ట్టారని విమర్శించారు.

ఎమ్మెల్యే పరిటాల సునీత ఫ పేరూరు డ్యాం సందర్శన
రామగిరి, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): వైసీపీ అసమర్థ పాలనకు సాక్ష్యం విరిగిన పేరూరు డ్యాం గేట్లే అని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఆమె సోమవారంమండలంలోని అప్పర్ పెన్నార్ (పేరూరు) డ్యాంను సందర్శించారు. మరమ్మతులకు గురైన డ్యాం గేట్లను పరిశీలించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... వర్షపు నీటితో జలాశయం నిండిన సమయంలో జాగ్రత్తలు తీసుకోకుండా, అవగాహన లేకుండా గేట్లు ఎత్తి వాటిని విరిగ్గొ ట్టారని విమర్శించారు. దీంతో డ్యాంలో చేరిన నీరు కాస్త వృథా అయిందన్నారు. గేట్లు విరిగిపోయిన తరువాత దాదాపు రెండేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ వాటి మరమ్మతుల గురించి పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేరూరు డ్యాం గేట్లతో పాటు ఈ ప్రాజెక్టుకు నీరందించే విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, జలవన రుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకెళ్లామన్నారు. దీం తో ప్రభుత్వం పేరూరు జలాశయం గేట్ల మరమ్మత్తులకు రూ.1.21కోట్లు మంజూరు చేసిందన్నారు. వారం రోజులుగా పనులు జరుగుతున్నా యన్నారు. విరిగిన గేట్ల భాగాలను బయటకు తీసి, వాటిని కర్నూల్‌కు తీసుకెళ్లి మరమ్మతులు చేయించామన్నారు. పేరూరు జలాశయానికి హాంద్రీనీవా నీటిని తీసుకొస్తామని గత ప్రభుత్వంలో తోపుదుర్తి ప్రకాశరెడ్డి కేవలం ప్రగల్బాలు పలికార న్నారు. అయితే దేవుడిదయతో వర్షం నీటితో డ్యాం నిండినా, అవగాహన లేమితో ఉన్న గేట్లను విరిగ్గొట్టడంతో ఆ నీరు వృథా అయిందన్నారు. దీంతో జలశాయంలోకి నీరు వచ్చినా నిల్వ ఉండని పరిస్థితి ఏర్పడిందన్నారు. గేట్ల మరమ్మతుల పనులు మూడునెలలో పూర్తి అవుతాయన్నారు. త్వరలో పేరూరుకు హాంద్రీనీవా నీటిని తీసుకువస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఆమె వెంట టీడీపీ సీనియర్ నాయకుడు రామ్మూర్తి నాయుడు,, మండల కన్వీనర్ సుధాకర్, పేరూరు సాగునీటిసంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణరెడ్డి, స్థానిక నేతలు వడ్డి సుబ్బు, నాగరాజు, ముత్యాలు, రాధ, అదికారులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....