Share News

MINISTER SAVITHA: బీసీల అభివృద్ధే చంద్రబాబు శ్వాస

ABN , Publish Date - Mar 11 , 2025 | 12:12 AM

బీసీల అభివృద్ధే ముఖ్యమంత్రి చంద్రబాబు నా యుడు శ్వాస అని రాష్ట్ర బీసీ సం క్షేమ శాఖ మంత్రి సవిత స్పష్టం చేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా బీసీల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నామన్నారు. అసెంబ్లీలో సోమవారం మంత్రి సవిత మాట్లాడారు.

MINISTER SAVITHA: బీసీల అభివృద్ధే చంద్రబాబు శ్వాస

హిందూపురం, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): బీసీల అభివృద్ధే ముఖ్యమంత్రి చంద్రబాబు నా యుడు శ్వాస అని రాష్ట్ర బీసీ సం క్షేమ శాఖ మంత్రి సవిత స్పష్టం చేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా బీసీల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నామన్నారు. అసెంబ్లీలో సోమవారం మంత్రి సవిత మాట్లాడారు. బీసీల అభివృద్ధికి ఎన్నడూలేనంతగా బడ్జెట్‌లో రూ.33.878.45 కోట్లు కేటాయించినందుకు సీఎం చంద్రబాబునాయుడుకు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌కి ధన్యవాధాలు అన్నారు. బీసీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధికి ఆర్థిక సాయం అందిస్తున్నారన్నారు. స్వయం ఉపాధి పథకాల అమలు చేస్తున్నామన్నారు. సీఎస్‌ సహా కీలక పోస్టుల్లో బీసీలకు ప్రాధాన్యమిచ్చారన్నారు. బీసీ పిల్లల విద్య కోసం అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. బీసీ హాస్టళ్లు, ఎంజేపీ స్కూళ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేశామన్నారు. త్వరలో మెగా డీఎస్సీ నెటిఫికేషన రానున్న నేపథ్యంలో బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో 26 జిల్లాల్లోనూ ఉచిత డీఎస్సీ కోచింగ్‌ సెంటర్లను నిర్వహిస్తామని చెప్పారు. మహిళలు, ఇతరుల కోసం ఆనలైన శిక్షణ ఇస్తామన్నారు. సివిల్‌ సర్వీసె్‌సకు కోచింగ్‌ ఇప్పిస్తామన్నారు. టీడీపీకి దక్కిన మూడు ఎమ్మెల్సీలను బడుగుబలహీన వర్గాలకు కేటాయించడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో బీసీలపై జరిగిన దాడులపై మండిపడ్డారు. గత ప్రభుత్వంలో బీసీలు, ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులపై తప్పుడు కేసులు బనాయించి, వేధించారన్నారు. 200 మందికి పైగా బీసీలు హత్యకు గురయ్యారనీ, 2600 మందిపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. ఒక్కచాన్స అంటూ బడుగుబలహీన వర్గాలతో ఓట్లేయించుకుని అధికారంలోకి వచ్చిన జగన బీసీ బిడ్డలను అన్నివిధాలా అణగదొక్కారని మంత్రి సవిత మండిపడ్డారు.

Updated Date - Mar 11 , 2025 | 12:12 AM