Share News

MLA : చెన్నకేశవాలయాన్ని పూర్తి చేయండి

ABN , Publish Date - Mar 13 , 2025 | 12:18 AM

మండలంలోని బోగినేపల్లిలో నిధులు లేక ఆగిపోయిన లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయ నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డిని కోరారు. ఎమ్మెల్యే పరిటాల సునీత, బోగినేపల్లి గ్రామస్థులు బుధవారం విజయవాడలో దేవాదాయశాఖ మంత్రిని కలిశారు. భోగినేపల్లిలోని లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయ నిర్మాణానికి రూ.1. 60 కోట్లతో అంచనా వేశారన్నారు.

MLA : చెన్నకేశవాలయాన్ని పూర్తి చేయండి
MLA Paritala Sunitha and Boginepalli villagers appealing to the minister

- మంత్రికి ఎమ్మెల్యే పరిటాల సునీత, భొగినేపల్లి గ్రామస్థుల వినతి

రాప్తాడు, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బోగినేపల్లిలో నిధులు లేక ఆగిపోయిన లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయ నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డిని కోరారు. ఎమ్మెల్యే పరిటాల సునీత, బోగినేపల్లి గ్రామస్థులు బుధవారం విజయవాడలో దేవాదాయశాఖ మంత్రిని కలిశారు. భోగినేపల్లిలోని లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయ నిర్మాణానికి రూ.1. 60 కోట్లతో అంచనా వేశారన్నారు. ఇందులో గ్రామస్థు లు 20 శాతం, ప్రభుత్వం నుంచి సీజీఎఫ్‌ నిధులు 80 శాతం చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అయితే గ్రామస్థులు రూ. 20 లక్షలు ఇవ్వగా, సీజీఎఫ్‌ నుంచి రూ. 50 లక్షలు మాత్రమే వచ్చిందన్నారు. దీంతో ఆలయ నిర్మాణం పూర్తి కాలేదన్నారు. ఆలయ నిర్మాణం పూర్తి కావాలంటే మరో రూ. కోటి అవసరమన్నారు. ఆలయ నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పరిటాల సునీత కూడా మంత్రికి విజ్ఞప్తి చేశారు. అయితే సీజీఎఫ్‌ నిధులు ఒక్కసారి వచ్చిన తరువాత మళ్లీ ఇవ్వడానికి వీలుండదని, సహకరిస్తామని మంత్రి ఆనం హామీ ఇచ్చినట్లు సర్పంచ ఉజ్జినప్ప, టీడీపీ నాయకులు నారా నారాయణ, శివయ్య, నారాయణ స్వామి, ప్రసాద్‌, గ్రామస్థుడు భాస్కర్‌రెడ్డి తదితరులు తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Mar 13 , 2025 | 12:18 AM