MLA : నీటి ఎద్దడి నివారణకు సహకరించండి
ABN , Publish Date - Mar 21 , 2025 | 12:23 AM
నియోజకవర్గంలోని మండలాల్లో వేసవి కా లంలో నీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక నిధులు ఇవ్యాల ని ఉప ముఖ్యమంత్రి పవనకల్యాణ్‌కు ఎమ్మె ల్యే బండారు శ్రావణిశ్రీ వినతి పత్రం అందజేశా రు. ఆమె గురువారం అసెంబ్లీ సమావేశాల అ నంతరం ఉప ముఖ్యమంత్రిని ఆయన చాంబర్‌లో కలిశారు.

- ఉప ముఖ్యమంత్రిని కోరిన ఎమ్మెల్యే శ్రావణిశ్రీ
శింగనమల, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలోని మండలాల్లో వేసవి కా లంలో నీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక నిధులు ఇవ్యాల ని ఉప ముఖ్యమంత్రి పవనకల్యాణ్‌కు ఎమ్మె ల్యే బండారు శ్రావణిశ్రీ వినతి పత్రం అందజేశా రు. ఆమె గురువారం అసెంబ్లీ సమావేశాల అ నంతరం ఉప ముఖ్యమంత్రిని ఆయన చాంబర్‌లో కలిశారు. శింగన మల నియోజకవర్గంలోని పలు మండలాల్లో వేసవి వస్తే నీటి ఎద్దడి తీవ్రంగా ఉంటుందని తెలిపారు. కావున నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు ఇవ్యాలని, అలాగే జల జీవన మిషన కింద గతంలో నిలి చిపోయిన పనులను తిరిగి ప్రారంభించాలని కోరారు. ఉప ముఖ్య మంత్రి సానూకులంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....