Share News

THEFT: పగలు.. రాత్రి బిజీ బిజీ..!

ABN , Publish Date - Feb 23 , 2025 | 12:29 AM

బంగారు ఆభరణాలను ఉదయం చోరీలు చేసి.. రాత్రిళ్లు కరిగించి బిస్కెట్‌గా మార్చి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర దొంగ సుహైల్‌ ఖానను పోలీసులు అరెస్టు చేశారు. అతన్నుంచి 350 గ్రాముల బంగారం బిస్కెట్‌ను స్వాధీనం చేసుకున్నారు.

THEFT: పగలు.. రాత్రి బిజీ బిజీ..!
CI Raghavana showing machines for melting recovered gold and jewellery

పెనుకొండ టౌన, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): బంగారు ఆభరణాలను ఉదయం చోరీలు చేసి.. రాత్రిళ్లు కరిగించి బిస్కెట్‌గా మార్చి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర దొంగ సుహైల్‌ ఖానను పోలీసులు అరెస్టు చేశారు. అతన్నుంచి 350 గ్రాముల బంగారం బిస్కెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. పెనుకొండ సర్కిల్‌ కార్యాలయంలో సీఐ రాఘవన ఈ కేసు వివరాలను శనివారం వెల్లడించారు. పెనుకొండ నారాయణమ్మ కాలనీలో ఉపాధ్యాయుల ఇళ్లలో జనవరి 20న సుహైల్‌ ఖాన చొరబడి, 470 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.లక్ష నగదు చోరీ చేశాడని సీఐ తెలిపారు. బెంగళూరుకు చెందిన సుహైల్‌ చోరీ చేసినట్లు సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించామని, తుమకూరులో శివానగర్‌లో ఈ నెల 13న అరెస్టు చేశామని తెలిపారు. రిమాండ్‌కు తరలించిన అనంతరం కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని విచారించామని తెలిపారు. నిందితుడు చోరీ చేసిన బంగారాన్ని కరిగించేందుకు ఆనలైనలో పరికరాలను కొనుగోలు చేశాడని అన్నారు. బిస్కెట్‌ బంగారాన్ని హైదరాబాద్‌లోని ఓ దుకాణంలో విక్రయించాడని తెలిపారు. అక్కడ రికవరీ చేశామని తెలిపారు. బంగారాన్ని కరిగించే యంత్రాలు, ద్విచక్ర వాహనాన్ని సీజ్‌ చేశామని తెలిపారు. మొత్తం 350 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశామని, ఇందులో 250 గ్రాములు పెనుకొండలో చోరీ చేసినదని, మిగిలిన సొమ్ము కుప్పంలో రెండు చోట్ల చోరీ చేసినదని తెలిపారు. హైదరాబాద్‌ బంగారం వ్యాపారి కూడా మోసపోయాడని, బంగారం కొని సు హైల్‌కు రూ.29 లక్షలు ఇచ్చాడని తెలిపారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన సీసీఎస్‌ ఎస్‌ఐ రాము, ఎస్‌ఐలు రాజేష్‌, వెంకటేశ్వర్లు, అంజినేయులు, కానిస్టేబుల్‌ ఆదినారాయణ, నాగరాజు, సుధాకర్‌, దస్తగిరి, రామును ఎస్పీ రత్న అభినందించారని సీఐ తెలిపారు. సుహైల్‌పై తెలంగాణ, ఆంధ్రప్రదేశ, కర్ణాటకలో పలు కేసులున్నాయని, మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ అని తెలిపారు.

Updated Date - Feb 23 , 2025 | 12:29 AM

News Hub