MLA : ఆలయ పునర్నిర్మాణానికి నిధులివ్వండి
ABN , Publish Date - Mar 21 , 2025 | 12:16 AM
మండలకేంద్ర మైన చెన్నేకొత్తపల్లిలో ఉన్న పురాతన అహోబిల లక్ష్మీనరసింహస్వామి దేవా లయ పునర్నిర్మాణానికి నిధులివ్వాలని ఎమ్మెల్యే పరిటాల సునీతతో కలిసి చెన్నేకత్తపల్లి గ్రామస్థులు టీటీడీ బోర్డు సభ్యులు, మడకశిర ఎమ్మెల్యే ఎం ఎస్ రాజును కోరారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం వారు ఎమ్మెల్యే పరిటాల సునీతతో కలిసి తన ఛాంబర్‌లో ఉన్న ఎంఎస్ రాజుకు వినతిప త్రం అందజేశారు.

ఫఎంఎస్ రాజుకు చెన్నేకొత్తపల్లి వాసుల వినతి
అనంతపురం/ చెన్నేకొత్తపల్లి, మార్చి20(ఆంధ్రజ్యోతి) : మండలకేంద్ర మైన చెన్నేకొత్తపల్లిలో ఉన్న పురాతన అహోబిల లక్ష్మీనరసింహస్వామి దేవా లయ పునర్నిర్మాణానికి నిధులివ్వాలని ఎమ్మెల్యే పరిటాల సునీతతో కలిసి చెన్నేకత్తపల్లి గ్రామస్థులు టీటీడీ బోర్డు సభ్యులు, మడకశిర ఎమ్మెల్యే ఎం ఎస్ రాజును కోరారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం వారు ఎమ్మెల్యే పరిటాల సునీతతో కలిసి తన ఛాంబర్‌లో ఉన్న ఎంఎస్ రాజుకు వినతిప త్రం అందజేశారు. రూ.1.25 కోట్లతో అంచనాలు తయారు చేశామన్నారు. గ్రామ కమిటీ ఆధ్వర్యంలో 20 నుంచి 30 శాతం నిధులను సమకూర్చు కుంటామన్నారు. దేవాదాయ శాఖ నిధుల నుంచి లేదా తిరుమల తిరుపతి దేవస్థానం నిధుల నుంచి కానీ నిధులు కేటాయించాలని కోరారు. ఇందుకు ఎంఎస్ రాజు సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....