Share News

MP , MLA : రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట

ABN , Publish Date - Jan 01 , 2025 | 12:51 AM

కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తోందని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే బండారు శ్రావణీశ్రీ పేర్కొన్నారు. మండల పరిధిలోని రెడ్డిపల్లిలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅథులుగా ఎంపీ, ఎమ్మెల్యే హజరయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయ పంటలకు డ్రోన ద్వారా మందుల పిచికారీ గురించి రెడ్డిపల్లి కృషివిజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా వివరించారు.

MP , MLA : రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట
Farm is calling MP Ambika Lakshminarayana and MLA Bandaru Shravanishree participated in the program.

ఎంపీ అంబికా, ఎమ్మెల్యే శ్రావణిశ్రీ

బుక్కరాయసముద్రం, డిసెంబరు31(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తోందని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే బండారు శ్రావణీశ్రీ పేర్కొన్నారు. మండల పరిధిలోని రెడ్డిపల్లిలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅథులుగా ఎంపీ, ఎమ్మెల్యే హజరయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయ పంటలకు డ్రోన ద్వారా మందుల పిచికారీ గురించి రెడ్డిపల్లి కృషివిజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా వివరించారు. ప్రస్తుతం వ్యవసాయంలో వచ్చిన సాంకేతిక విప్లవాత్మక మార్పులపై కేవీకే ప్రధాన శాస్త్రవేత్త మల్లీశ్వరి రైతులకు డెమో ద్వారా తెలియజేశారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ... గత టీడీపీ హయాంలో మాదిరిగానే ప్రస్తుతం తమ ప్రభుత్వం రైతుల సంక్షేమ కోసం అనేక సంక్షేమ పథకాలును అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి ఉమామాహేశ్వరమ్మ, ఏడీఏ రవి, వెటర్నరీ ఏడీ రత్నకుమార్‌, ఎంపీపీ సునీత, కన్వీనర్‌ అశోక్‌కుమార్‌, జిల్లా టీడీపీ నాయకులు పసుపుల శ్రీరామరెడ్డి, ఏఓ శ్యాం కుమార్‌రెడ్డి, తహసీల్దార్‌ పుణ్యవతి, ఎంపీడీఓ సాల్మనరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.


పేదల జీవితాల్లో వెలుగు నింపడమే కూటమి లక్ష్యం

బుక్కరాయసముద్రం, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): పేదల జీవితాల్లో వెలుగు చూడాలన్న ఏకైక లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే బండారు శ్రావణీశ్రీ అన్నారు. మండల పరిధిలోని రెడ్డిపల్లిలో మంగళవారం నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వారు ముఖ్యఅతిథిలుగా హాజరై మాట్లాడారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనతో అస్తవ్యస్తంగా మారిని రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా చక్కదిద్దుతోందన్నారు. అలాగే అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ అశోక్‌, జిల్లా నాయకులు పసుపుల శ్రీరామరెడ్డి, సాకే రామక్రిష్ణ, కేశన్న, పొడరాళ్ల రవీంద్ర, ఓబులపతి తదితర నాయకులు , అఽధికారులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jan 01 , 2025 | 12:51 AM