CRICKET : ఫ్రెండ్‌షిప్ క్రికెట్ సిరీస్ విజేత హైదరాబాద్
ABN , Publish Date - Jan 01 , 2025 | 12:27 AM
ఫ్రెండ్‌షిప్ క్రికెట్ సిరీస్ విజేతగా హైదరాబాద్ జట్టు నిలిచింది. అనంతపురం నగరంలోని ఆర్డీటీ స్టేడియంలో మంగళవారం ఫ్రెండ్‌షిప్ క్రికెట్ సిరీస్ ఫైనల్ పోటీలు నిర్వహించారు. హట్‌హాక్స్ న్యూజిలాండ్, హైదరాబాద్ పీకే స్పోర్ట్స్ జట్ల మధ్య మ్యాచ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 25.4 ఓవర్లలో 194 పరు గులకు ఆలౌట్ అయింది.
అనంతపురం క్లాక్‌టవర్, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): ఫ్రెండ్‌షిప్ క్రికెట్ సిరీస్ విజేతగా హైదరాబాద్ జట్టు నిలిచింది. అనంతపురం నగరంలోని ఆర్డీటీ స్టేడియంలో మంగళవారం ఫ్రెండ్‌షిప్ క్రికెట్ సిరీస్ ఫైనల్ పోటీలు నిర్వహించారు. హట్‌హాక్స్ న్యూజిలాండ్, హైదరాబాద్ పీకే స్పోర్ట్స్ జట్ల మధ్య మ్యాచ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 25.4 ఓవర్లలో 194 పరు గులకు ఆలౌట్ అయింది. అనంతరం బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు 25.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి, 197 పరుగులతో విజయం నమోదు చేసింది. ఆరు వికెట్ల తేడాతో గెలుపొందిన హైదరాబాద్ జట్టు విజేతకాగా, న్యూజిలాండ్ రన్నర్‌గా నిలిచింది. ఈ కార్యక్రమంలో ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెటర్ హసీబ్‌హమీద్, న్యూజి లాండ్ మాజీ క్రికెటర్ బ్రూస్ ఎడ్గర్, న్యూజిలాండ్ హట్‌హాక్స్ జట్టు చైర్మన రవి కృష్ణమూర్తి, హైదరాబాద్ మాజీ ప్లేయర్ గౌస్‌బాబా, రంజీ మాజీ క్రీడాకారుడు షాబుద్దీన, కోచలు ప్రవీత, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....