Share News

MLA: హత్యాయత్నం వెనుక ప్రకాష్‌రెడ్డి పాత్ర

ABN , Publish Date - Mar 26 , 2025 | 01:04 AM

మాజీ సర్పంచ మోహన రెడ్డి పై హత్యాయత్నం వె నుక మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పాత్ర ఉండొచ్చని ఎ మ్మెల్యే పరిటాల సునీత ఆరోపించారు. రుద్రంపేట సమీపంలోని మదర్‌ థెరిస్సా కాలనీలో గాండ్లపర్తి కొత్తపల్లి మాజీ సర్పంచ మోహనరెడ్డిపై హత్యయత్నం జరిగింది. బాధితుడు నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఎమ్మెల్యే పరిటా ల సునీత మంగళవారం పరామర్శించారు.

MLA:  హత్యాయత్నం వెనుక ప్రకాష్‌రెడ్డి పాత్ర
MLA visiting the victim

ఎమ్మెల్యే పరిటాల సునీత ఫ మాజీ సర్పంచకు పరామర్శ

అనంతపురం అర్బన, మార్చి 25 (ఆంఽధ్రజ్యోతి): మాజీ సర్పంచ మోహన రెడ్డి పై హత్యాయత్నం వె నుక మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పాత్ర ఉండొచ్చని ఎ మ్మెల్యే పరిటాల సునీత ఆరోపించారు. రుద్రంపేట సమీపంలోని మదర్‌ థెరిస్సా కాలనీలో గాండ్లపర్తి కొత్తపల్లి మాజీ సర్పంచ మోహనరెడ్డిపై హత్యయత్నం జరిగింది. బాధితుడు నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఎమ్మెల్యే పరిటా ల సునీత మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ... ఎన్నికలకు ముందు మోహనరెడ్డి వైసీపీ నుంచి టీడీపీలో చేరా రన్నారు. అలాగే ఒక భూమి వ్యవహారంలో బాధితుల పక్షాన నిలబడ్డారన్నా రు. అప్పుడే తనను చంపేస్తామని వైసీపీ నాయకులు బెదిరించినట్లు బాధి తుడు చెప్పారన్నారు. ఈ దాడి వెనుక గాండ్లపర్తి కొత్త పల్లి సర్పంచ భర్త కృష్ణారెడ్డి ఉన్నట్లు తెలుస్తోందన్నారు. అయితే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అండ లేకుండా ఇది జరిగే అవకాశం లేదన్నారు. తాము కూడా ప్రతిదాడులతో సమాధానం చెప్పవచ్చని, అయితే అది మంచి పద్ధతి కాదన్నారు. దాడి చే సిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటే, ఇలాంటివి పునరావృతం కావన్నారు.

అధైౖర్య పడకండి అండగా ఉంటాం

ఆత్మకూరు: మండల పరిధిలోని సనప గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్‌ నాయకుడు నీళ్ళపాళ కురుబ నాగన్న(60)రెండురోజులు క్రితం అనారొగ్యంతో మృతి చెందారు. ఎమ్మెల్యే పరిటాల సునీత మంగళవారం గ్రామానికి వెళ్లి అయన కుటుంబ సభ్యులును పరామర్శించారు. అధైర్య పడకండి అండగా ఉంటామని భరోసా కల్పించారు. టీడీపీ మండల ఇనచార్జ్‌ బాలాజీ, నాయకులు నారాయణ స్వామి, పరశురామ్‌, శ్రీనివాసులు, వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

ఫఅనంతపురం రూరల్‌: ఎన్నికల మునుపు ఇచ్చిన మాట ప్రకారం అధికారం చేపట్టిన తొమ్మిది నెలల్లో ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తు న్నామని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. ఆమె మంగళవారం నగరం లోని క్యాంపు కార్యాలయంలో రాప్తాడు నియోజకవర్గంలోని పలువురికి సీఎం ఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేశారు. అనంతపురంరూరల్‌, ఆత్మకూరు, రాప్తా డు పరిధిలోని 21మందికి రూ. 25లక్షల చెక్కులను అందజేశారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Mar 26 , 2025 | 01:04 AM