MLA : ప్రజా స్పందన కరువై పెయిడ్ ఉద్యామాలు
ABN , Publish Date - Jan 01 , 2025 | 12:23 AM
అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలు నిర్ణయాలతో ప్రజలను ఇబ్బంది పెట్టి, ఇప్పుడు ప్రజా స్పందన కరువై పెయిడ్ ఉద్యమాలు చేస్తు న్నారని వైసీపీ అధినేత జగనపై ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ మండిపడ్డారు. ఇనచార్జ్ కలెక్టర్ శివనారాయణశర్మ, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ మంగళవారం నగరంలోని 41వ డివిజనలోని హైదర్‌వల్లి కాలనీ, ఎల్బీ నగర్‌లో సామాజిక భరోసా పింఛన్లు పంపిణీ చేశారు.
జగనపై ఎమ్మెల్యే దగ్గుపాటి ఫైర్
ఇనచార్జ్ కలెక్టర్ శివనారాయణశర్మతో కలిసి పింఛన్ల పంపిణీ
అనంతపురం అర్బన, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి) : అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలు నిర్ణయాలతో ప్రజలను ఇబ్బంది పెట్టి, ఇప్పుడు ప్రజా స్పందన కరువై పెయిడ్ ఉద్యమాలు చేస్తు న్నారని వైసీపీ అధినేత జగనపై ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ మండిపడ్డారు. ఇనచార్జ్ కలెక్టర్ శివనారాయణశర్మ, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ మంగళవారం నగరంలోని 41వ డివిజనలోని హైదర్‌వల్లి కాలనీ, ఎల్బీ నగర్‌లో సామాజిక భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. అలాగే 20వ డివిజనలోపి ఫవర్ ఆఫీస్ సమీపంలోని మోమిన బజార్, ఖాజానగర్, అరుణోదయ కాలనీ జెండా కట్ట వద్ద, 42వ డివిజనలో ఆరో రోడ్డు నాగుల కట్ట వద్ద, ఎమ్మెల్యే దగ్గుపాటి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇనచార్జి కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో ఎన్టీఆర్ భరోసా ద్వారా తొలి రోజే వంద శాతం పింఛన్లు పంపిణీ చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. లబ్దిదారుల ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జనవరి 1వ తేదీ ఆంగ్ల నూతన సంవత్సరాది కావడంతో సీఎం చంద్రబాబునాయుడు ఒక రోజు ముందే పం పిణీ చేయాలని ఆదేశించారన్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఉద యం నుంచే పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈనెలలో ఎవరైనా తీసుకోకపోతే వచ్చే నెలలో రెండు నెలలకు కలిపి అందజేస్తామన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... గత ప్రభుత్వం తప్పిదాలతో ప్రజలపై కోట్లలో విద్యుత భారం పడిందన్నారు. అయితే వారే ఇప్పుడు విద్యుత చార్జీలు పెంచారంటూ పెయిడ్ ఉద్యమాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో నిరసన కార్యక్రమాలకు డబ్బులు ఇచ్చి జనాన్ని తోలుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఇనచార్జ్ కమిషనర్ రామలింగేశ్వర్, తహసీల్దార్ హరికుమార్, టీడీపీ నాయకులు గంగారామ్, రాయల్ మురళి, పోతుల లక్ష్మీనరసింహులు, కడియాల కొండన్న, పరమేశ్వరన, పీఎల్‌ఎన మూర్తి, రమేష్, శ్రీనివాస్‌రెడ్డి, సంగా తేజస్విని, వియశ్రీరెడ్డి, బల్లా పల్లవి, సరళ, వడ్డే భవానీ తదితరులు పాల్గొన్నారు. ఆరో రోడ్డులోని శ్మశాన వాటికలో కనీస సదుపాయాలు కల్పించాలని మాజీ కార్పొరేటర్ సరళ కోరారు. పింఛన్ల పంపిణీకి వచ్చిన ఎమ్మెల్యేకి శ్మశానంలో నెలకొన్న దుస్థితిని వివరించారు. శ్మశానాన్ని శుభ్రం చేయించి, ప్రహారీ నిర్మించాలన్నారు. కరెంటు సదుపాయం కల్పించి, బోరు వేయించాలని కోరారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....