MLA : పల్లె సంప్రదాయాలను కాపాడుకోవాలి
ABN , Publish Date - Feb 28 , 2025 | 12:25 AM
గ్రామీణ ప్రాంతాల సంప్రదాయ లు ఇటీలవ కాలంలో కనుమరుగవుతున్నాయని, వాటిని కాపాడుకోవాల్సిన బాద్యత మనపై ఉందని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. మండల పరిధిలోని బి. యాలేరు గ్రామంలో శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకోని గురువారం పరిటాల రవ్రీంద్ర ట్రస్టు ఆధ్వర్యంలో రాతిదూలం లాగు డు పోటీలను నిర్వహించారు.

ఎమ్మెల్యే పరిటాల సునీత
ఆత్మకూరు, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల సంప్రదాయ లు ఇటీలవ కాలంలో కనుమరుగవుతున్నాయని, వాటిని కాపాడుకోవాల్సిన బాద్యత మనపై ఉందని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. మండల పరిధిలోని బి. యాలేరు గ్రామంలో శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకోని గురువారం పరిటాల రవ్రీంద్ర ట్రస్టు ఆధ్వర్యంలో రాతిదూలం లాగు డు పోటీలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పరిటాల సునీత హాజరయ్యారు. పోటీలును తిలకించడానికి జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చారు. ఉత్సాహంగా జరిగిన పోటీ ల్లో 10జతల ఎద్దులు పాల్గొన్నాయి. గెలుపొందిన ఎద్దుల యజమానులకు పరిటాల రవీంద్ర ట్రస్టు ద్వారా నగదు బహుమతులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ఇనచార్జి బాలాజీ, మండల కన్వీనర్ శ్రీనివాసులు, తెలుగుయువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణస్వామి, టీఎనఎస్‌ఎఫ్ ప్రధాన కార్యదర్శి పరశురామ్, మండల మాజీ కన్వీనర్ క్రిష్ణమోహన చౌదరి, మండల నాయకులు నాగేంద్ర, ఈశ్వరయ్య, ఈడిగ ఈశ్వరయ్య, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
విజేతలకు బహుమతులు ఇలా... మొదటి బహుమతి సాధించిన తోపుదుర్తి చెన్నప్ప ఎద్దులకు రూ. 50వేలు నగదు అందజేశారు. రెండో బహుమతి రూ. 40వేలను గార్లదిన్నె రామాంజనేయులుకు, మూడో బహుమతి రూ. 30 వేలను కట్టకింద పల్లి అచారికి, నాలుడో బహుమతి రూ. 20వేలను సోములదొడ్డి రామసుబ్బారెడ్డికి, ఐదో బహుమతి రూ. 10 వేలను ధర్మవరం రవీంద్రారెడ్డికి అందజేశారు. పోటీలకు వచ్చిన ఎద్దుల యజమానులను ట్రస్టు ద్వారా మె మెంటోలతో సత్కరించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....