Share News

MLA : అవినీతి సొమ్ము కక్కిస్తాం

ABN , Publish Date - Mar 18 , 2025 | 12:26 AM

‘ఎవరెవరిపై అవినీతి ఆరోపణలున్నాయో అన్నీ లెక్కి స్తాం. అవినీతి సొమ్ము కక్కిస్తాం’ అని ఎమ్మెల్యే దగ్గు పాటి ప్రసాద్‌ స్పష్టం చేశారు. అనవసర ఆరోపణలు వద్దని, ముందు విచారణ చేయించాలని నగర మేయర్‌ మహమ్మద్‌ వసీం అన్నారు. సోమవారం 2025-26 సం వత్సరానికి సంబంధించి బడ్జెట్‌ అంశంపై నిర్వహించిన నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశం వాడి-వేడిగా సాగింది.

MLA : అవినీతి సొమ్ము కక్కిస్తాం
MLA Daggupati in meeting

- కౌన్సిల్‌ సమావేశంలో ఎమ్మెల్యే దగ్గుపాటి

- బయోమైనింగ్‌, కుక్కల ఆపరేషనపై ఆగ్రహం

-ముందు విచారణ చేయించండి : మేయర్‌ వసీం

- పలు అంశాలపై రచ్చ

అనంతపురం క్రైం,మార్చి 17 (ఆంధ్రజ్యోతి): ‘ఎవరెవరిపై అవినీతి ఆరోపణలున్నాయో అన్నీ లెక్కి స్తాం. అవినీతి సొమ్ము కక్కిస్తాం’ అని ఎమ్మెల్యే దగ్గు పాటి ప్రసాద్‌ స్పష్టం చేశారు. అనవసర ఆరోపణలు వద్దని, ముందు విచారణ చేయించాలని నగర మేయర్‌ మహమ్మద్‌ వసీం అన్నారు. సోమవారం 2025-26 సం వత్సరానికి సంబంధించి బడ్జెట్‌ అంశంపై నిర్వహించిన నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశం వాడి-వేడిగా సాగింది. నగర మేయర్‌ మహమ్మద్‌ వసీం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌, కమిషనర్‌ బాలస్వామి, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, అధికారులు హాజరయ్యారు. ముఖ్యంగా డంపింగ్‌యార్డ్‌, కుక్కల ఆపరేషనకు చెందిన అనిమల్‌ బర్త్‌ కంట్రోల్‌ (ఏబీసీ)అంశాలపై టీడీపీ, వైసీపీ వర్గాలు వాగ్వాదాలతో రచ్చ లేపారు. అనుకున్నట్లుగానే బిల్లుల పైనే తీవ్ర స్థా యిలో చర్చ జరిగింది. కార్పొరేటర్లు పలు స్థానిక సమ స్యలను కౌన్సిల్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఒకానొక సందర్భంలో కార్పొరేటర్లు ఇష్టానుసారంగా మాట్లాడటంపై నగర కమి షనర్‌ బాలస్వామి అసహనం వ్యక్తం చేశారు. మొత్తం రూ.135కోట్ల బడ్జెట్‌కు కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. సభ్యు లడిగిన ప్రతి ప్రశ్నకు తాను లేదా సంబంధిత అధికారి ద్వారా కమిషనర్‌ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఆ డబ్బెవరు కడతారు అబూ...?

సమావేశంలో 13వ డివిజన కార్పొరేటర్‌ అబూసాలెహ మాట్లాడుతూ... కమలానగర్‌ పరిధిలోని బాషా హాటల్‌ యజమాని బాషా మృతి చెందారని తెలిపారు. కానీ ట్రేడ్‌ లైసెన్స రూ.లక్షల్లో కట్టాలంటున్నా రని, చనిపోయిన వ్యక్తి ఆ డబ్బు ఎలా కడతారని ప్రశ్నించారు. ఆయన కోడలి పేరుతో కొత్త ట్రేడ్‌ లైసెన్స ఇవ్వాలని కోరారు. అలా కుద రదని ఎంహచఓ విష్ణుమూర్తి చెప్పగా... ఎందుకు కాదంటూ కార్పొరేటర్‌ దబాయించారు. కమిషనర్‌ జోక్యం చేసుకుని...ఆ విషయం పరిశీలిస్తామని చెప్పారు.


రగడ ఇలా మొదలు

కార్పొరేటర్‌ లాలు మాట్లాడుతూ... డంపింగ్‌యార్డు సమస్యపై సరైన సమాధానం చెప్పాలంటూ నేలపై బైఠా యించి నిరసన తెలిపారు. ఇందుకు ఎమ్మెల్యే స్పందిస్తూ డంపింగ్‌ యార్డ్‌కు సంబంధించి టెండరు పిలిచామని, అక్టోబరు 2లోగా శుభ్రం చేస్తామని తెలిపారు. త్వరలోనే కొత్త డంపింగ్‌యార్డును తీసుకొస్తామన్నారు. మేయర్‌ వసీం మాట్లాడుతూ... అప్పటి లోగా బయో మైనింగ్‌ చే యించడంగానీ, ప్రత్యామ్నాయమార్గం కానీ చూడాల న్నారు. అనంతరం లాలు మాట్లాడుతూ...నగరంలో కు క్కల బాధ లేకుండా చేయాలని నాలుగేళ్ల నుంచి కోరుతు న్నా పట్టించుకోవడంలేదన్నారు. ఎమ్మెల్యే మాట్లాడు తూ...కుక్కల ఆపరేషనకు సంబంధించి అనిమల్‌బర్త్‌ కంట్రోల్‌(ఏబీసీ) రూ. 48 లక్షల ప్రాజెక్టు పేరుతో చేప ట్టిన పనిలో వర్క్‌ ఆర్డర్‌ లేకుండా బిల్లులు ఎలా చేశారని ప్రశ్నించారు. ఇందుకు కమిషనర్‌ మాట్లాడుతూ... ఆ రికార్డ్స్‌ పక్కాగా లేవని, కానీ కొంతవరకు నిధులిస్తేనే ఆ సంస్థ చేస్తానని చెప్పిందన్నారు. అందులో తాము పరిశీలి స్తే లోపాలున్నట్లు తేలిందన్నారు. ఇదే సమయంలోనే డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్‌రెడ్డి, సాహిత్య మాట్లాడుతూ... కుక్కల వర్క్‌కు సంబంధించి డబ్బారే కులకు అధికంగా ఎస్టిమేషన వేశారన్నారు. గతంలోనే రూ. 14 లక్షల చెక్కు ఇస్తుంటే నిలిపి వేశామని, మరో సారి ఎందుకివ్వాల్సి వచ్చిందని ప్రశ్నించారు. దీనిపై విచారణ జరగాలన్నారు. కమిషనర్‌ మాట్లాడుతూ... వర్క్‌ ప్రాసెస్‌లో ఉండటంతో ఇవ్వాల్సి వచ్చిందన్నారు. పెండిం గ్‌లో ఉన్న డబ్బు విడుదల చేస్తే మిగిలిన పని పూర్తి చే స్తామన్నారు. కౌన్సిల్‌లో తీర్మానం చేస్తే కొత్త ఏజెన్సీకి ఆ వర్క్‌ అప్పగిద్దామని తెలిపారు.


డంపింగ్‌యార్డ్‌పై రచ్చ

కొంతసేపటికే గుత్తి రోడ్డు డంపింగ్‌యార్డ్‌పై రచ్చ జరిగింది. గతంలో దొంగ బిల్లులతో దోచేశారని ఎమ్మెల్యే అన్నారు. ఇందుకు మేయర్‌ మాట్లాడుతూ...గతంలో కొంతవరకే ఇచ్చామని, ఆ తరువాత మీరే బిల్లు చేయమని చెప్పారని అన్నారు. ఇందుకు ఎమ్మెల్యే మాట్లా డుతూ...ఎవరెవరిపై అవినీతి ఆరోపణలున్నాయో వెలికి తీసి, ఆ సొమ్మంతా కక్కిస్తామని అన్నారు. మేయర్‌ మాట్లాడుతూ...ప్రతి సారి అనవసర ఆరోపణలు తగదని, ముందు విచారణ చేయించాలన్నారు. ఈ తొమ్మిది నెల ల్లో ఏం జరిగిందో తామూ వెలికితీస్తామన్నారు. డిప్యూటీ మేయర్‌ విజయభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ... 77రోజులు మిషనరీ పనిచేయకపోయినా రూ. 3లక్షలకు పైగా చెత్త బయోమైనింగ్‌ ఎలా జరిగిందన్నారు. ఇదే సమయంలో మేయర్‌... అప్పట్లో మాజీ ఎమ్మెల్యే సమక్షంలో అని అంటుండగా... మాజీ ఎమ్మెల్యే ప్రస్తా వన ఎందుక ని..మీకు తెలియకుండానే జరిగిందా అని ఎమ్మెల్యే ప్రశ్నిం చారు. కార్పొరేటర్లు నరసింహులు, కమల్‌భూషణ్‌, అనిల్‌ మాట్లాడుతూ... ఎవరి హయాంలో ఎంత బిల్లు చేశారో తేల్చాలనగా... విచారణ జరుగుతుందని. ఎంత అవినీతి జరిగిందో ఆ లెక్క తేలుస్తామని ఎమ్మెల్యే అన్నారు. అలాగే రూ. 1500 తో షెడ్డు కట్టిస్తానని మీ డిప్యూటీ మేయర్‌ చెబుతున్నా రని, అదనంగా రూ. 3500 ఎందుకు ఎస్టిమేషన వేయించారని ప్రశ్నించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Mar 18 , 2025 | 12:26 AM