AP BJP MLAs: మాకు పోస్టులు ఇవ్వడం లేదు.. బీజేపీ ఎమ్మెల్యేల అసంతృప్తి
ABN , Publish Date - Feb 28 , 2025 | 08:49 PM
AP BJP MLAs: ఏపీ బీజేపీ శాసన సభా పక్ష సమావేశం విజయవాడలోని ఎమ్మెల్యే సుజనా చౌదరి నివాసంలో జరిగింది. ఆ సమావేశానికి బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు ఆ పార్టీ సీనియర్లు సైతం హాజరయ్యారు.

విజయవాడ, ఫిబ్రవరి 28: ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలని బీజేపీ శాసనసభా పక్షం అభిప్రాయపడింది. శుక్రవారం విజయవాడలో ఎమ్మెల్యే సుజనా చౌదరి నివాసంలో బీజేపీ శాసన సభా పక్షం సమావేశమైంది. ఈ సందర్భంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. సంకీర్ణంలో ఉన్నాం కాబట్టి సమస్యలను జాగ్రత్తగా డీల్ చేయాలన్నారు. కొన్ని ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలకు న్యాయం జరగడం లేదంటూ ఫిర్యాదులు వస్తున్నాయని నేతలు తెలిపారు. దేవస్థానం పాలక వర్గాల్లో బీజేపీ కార్యకర్తలకు స్థానం కల్పించాలంటూ ఎంఎల్ఏలు.. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దుగ్గుబాటి పురందేశ్వరికి విజ్జప్తి చేశారు.
Also Read: నా బ్యాగులు మోయవద్దు.. స్టేషన్‌కు రావొద్దు
దేవస్థానం కమిటీలల్లో జరిగే నియామకాల్లో బీజేపీ నేతలను విస్మరిస్తున్నారని ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లారు. వీటిని సీఎం దృష్టికి తీసుకు వెళ్లి.. దేవస్థానం కమిటీల్లో బీజేపీ నేతలను నియమించాలని కోరదామన్నారు. అలాగే కూటమి ప్రభుత్వంపై విమర్శలుగా కాకుండా సలహాలు రూపంలో ఉండాలని ఈ పార్టీ అగ్రనేతలు.. ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. అదే విధంగా ఈ రోజు శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఈ సమావేశంలో చర్చ జరిగింది.
Also Read: బెదిరిస్తే బెదరడానికి ఎవరూ లేరు
ఆర్థిక కష్టాలున్న సమయంలో అభివృద్ధి, సంక్షేమానికి సమపాళ్లలో ప్రాధాన్యత ఇచ్చారని బీజేపీ నేతలు అభిప్రాయ పడ్డారు. ఈ సమావేశానికి మంత్రి సత్యకుమార్, ఎంపీ సీఎం రమేష్, బీజేపీ ఎమ్మెల్యేలు విష్ణు కుమార్ రాజు, కామినేని శ్రీనివాస్, ఆదినారాయణ రెడ్డి, నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి, సుజనా చౌదరి, పార్థసారథి, ఎన్ ఈశ్వర రావులతోపాటు ఆ పార్టీ సీనియర్ నేతలు మధుకర్ జీ, పాతూరి నాగభూషణం తదితరులు హాజరయ్యారు.
మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: మీరు ప్రయాణిస్తున్న రైలులో ఛార్జింగ్ సాకెట్ పనిచేయడం లేదా.. ఇలా చేస్తే క్షణాల్లో ..
Also Read: Fact Check : రూ.3 వేలకే ఎలక్ట్రిక్ సైకిల్.. కొందామనుకొంటున్నారా
Also Read: శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలంటూ విద్యార్థులకు పిలుపు
Also Read: భవిష్యత్తులో ఏపీలో రాబోయే మార్పులు చెప్పిన పవన్
For AndhraPradesh News And Telugu News