Home » Sujana Chowdary
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి తీరని లోటని కేంద్రమాజీ మంత్రి, బీజేపీ నేత సుజాన చౌదరి పేర్కొన్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా కమ్యూనిస్టు భావాలను నమ్ముకుని జీవితమంతా దేశం కోసం కష్టపడ్డారన్నారు. ఢిల్లీలో సీతారాం ఏచూరి పార్థివదేహానికి నివాళులర్పించి..
Andhrapradesh: ఆర్ఎస్‌ఎస్ నేతృత్వంలోని సహకార భారతి ఆధ్వర్యంలో విజయవాడలో సెమినార్ నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధిలో సహకార సొసైటీల భాగస్వామ్యంపై చర్చించనున్నారు. ఈ సెమినార్‌లో బీజేపీ నేత సుజనా చౌదరి, ముత్తవరపు మురళీకృష్ణ, చలసాని ఆంజనేయులు పాల్టొన్నారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ... దేశంలో సహకార భారతి గురించి అందరూ తెలుసుకోవాలన్నారు.
సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం నాడు జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమం ద్వారా ఉద్యోగం పొందిన యువతకు జాయినింగ్ లెటర్‌లను ఎమ్మెల్యే సుజనా చౌదరి అందజేశారు. పశ్చిమ నియోజకవర్గంలో జాబ్‌మేళా పెడితే ఏడు వేల మంది వచ్చారని వెల్లడించారు.
జాతీయ చేనేత దినోత్సవం(National Handloom Day) సందర్భంగా సీఎం చంద్రబాబు(CM Chandrababu Naidu) చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. చేనేతకారుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి కొత్త ట్రెండ్ సెట్ చేశారు. గెలిచే వరకు ఓ మాట.. గెలిచిన తర్వాత మరో మాట చెప్పే పాత ట్రెండ్‌కు గుడ్‌బై చెబుతూ... ప్రతి నెల నియోజకవర్గంలో తాను చేసిన పనులపై ప్రోగ్రెస్ రిపోర్ట్ విడుదల చేసే కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.
Andhrapradesh: ఏపీ చరిత్రలో చాలా శుభదినమని ఎమ్యెల్యే సుజన చౌదరి అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... అరాచక ఆటవిక పాలనలో రాష్ట్రం ఏమైందో చూశామన్నారు. అమరావతిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఇప్పుడు ఎన్డీఏ సర్కార్ భారీగా నిధులు కేటాయించిందని తెలిపారు. చట్టం ప్రకారం రావలసిన వాటినే తెచ్చుకోనే స్తోమత లేకుండా గత ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు.
అస్సలు గెలిచే ప్రసక్తే లేదు.. విజయవాడ పశ్చిమ కాకుండా వేరే ఏ నియోజకవర్గం అయినా బాగుండేది.. ఇక్కడ పోటీచేసి సుజనా చౌదరి అనవసరంగా ఓడిపోతారేమోనని కూటమి కార్యకర్తల్లో ఒకింత అనుమానం ఉండేది. సీన్ కట్ చేస్తే.. గెలుపే కాదు, ఊహించని మెజార్టీ దక్కించుకున్నారు..