Share News

CM Chandrababu Naidu: వీరంతా శాశ్వత ఎమ్మెల్యేలు కావాలి

ABN , Publish Date - Mar 20 , 2025 | 09:48 PM

CM Chandrababu Naidu: విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో ఎమ్మెల్యేల సాంస్కృతిక ఉత్సవాలు జరిగాయి. అందులో భాగంగా పలువురు ఎమ్మెల్యేల ప్రదర్శనలు అందరిని ఆకట్టుకొన్నాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. పలువురు ఎమ్మెల్యేల ప్రతిభా పటవాలు ప్రదర్శించారని చెప్పారు. అలాగే ఎమ్మెల్యేల నటనపై ప్రశంసల జల్లు కురిపించారు.

CM Chandrababu Naidu: వీరంతా శాశ్వత ఎమ్మెల్యేలు కావాలి
AP CM Chandrababu

అమరావతి, మార్చి 20: ప్రజా సమస్యలపై సభలో హోరాహోరీగా పోరాడిన.. లాబీల్లో ఆప్యాయంగా పలకరించుకోవటం ఆరోగ్యకరమైన రాజకీయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ తరహా స్ఫూర్తిదాయక రాజకీయాలు నేడు కలుషితమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ లకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. అసెంబ్లీ అనేది ప్రజలకు జవాబుదారీ కానీ.. ప్రతిపక్షానికి కాదని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో బూతులు విన లేక ప్రజలు టీవీలు కట్టేసే పరిస్థితి గత ఐదేళ్లలో మనం చశామన్నారు.

కౌరవ సభను గౌరవ సభగా మార్చి చూపించామని ఆయన తెలిపారు. ప్రస్తుతమున్న ఎన్డీఏ ఎమ్మెల్యేలు శాశ్వతంగా ఎమ్మెల్యేలుగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. జీవితంలో ఎన్నో కార్యక్రమాలు చూశా కానీ.. సభ్యుల్లో ఇంత అసాధారణ ప్రతిభ మాత్రం ఇప్పుడే చూస్తున్నానన్నారు. నలుగురు పిల్లల్ని కనాలనే సీరియస్ విషయాన్ని హాస్య సందేశంతో చాలా చక్కగా అర్ధమయ్యేలా ప్రదర్శించారని తెలిపారు.


అమాయక కార్యకర్తగా, పాత తరం ఎమ్మెల్యేగా జీవీ ఆంజనేయులు ప్రతిభ అద్భుతమని ప్రశంసించారు. ఈశ్వరరావు అసందర్భ పాటలకు నవ్వు ఆపుకోవడం తన వల్ల కాలేదన్నారు. రోజు ఇలానే నవ్వుకుంటే ఇక ఆసుపత్రులతో పని ఉండదన్నారు. క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలకు బడ్జెట్ పెంచాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఎక్స ట్రా ఎనర్జీ‌తో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారని ప్రశంసించారు. అందరినీ సంతృప్తి పరిచాననే ఆనందం అయ్యన్నపాత్రుడిలో కనిపిస్తోందని సీఎం చంద్రబాబు ఛలోక్తి విసిరారు. కూచిపూడి తనకెంతో ఇష్టమైన కళ అని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ప్రధాని రాజధాని అమరావతికి వచ్చినప్పుడు కూచిపూడి నృత్య ప్రదర్శన ఆయన ముందు ఉంటుందన్నారు. వచ్చే ఏడాది ఇంత కంటే ఘనంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.


ఈ సాంస్కృతిక కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్ తదితరులు హాజరయ్యారు. క్రీడా,సాంస్కృతిక పోటీల్లో విజేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు బహుమతులు అందచేశారు. మరోవైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగిశాయి. నేపథ్యంలోఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు డిన్నర్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏర్పాటు చేశారు.

Also Read:

Marri Rajasekhar: జగన్ అలా చేయడం తీవ్రంగా బాధించింది

Pawan Kalyan : ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయికి వచ్చిందంటే.. వారే కారణం

Nirmala Sitharaman: ఏప్రిల్ 1 నుంచి రానున్న మార్పులివే...

CM Nitish Kumar: అసెంబ్లీలో ఏమిటిది అధ్యక్ష్యా..

Toothpick: టూత్‌పిక్‌తో దంతాలను శుభ్రం చేస్తే.. ఇంత డేంజరా?

Tirumala: తిరుమలలో భక్తుల మధ్య ఘర్షణ.. ఒకరికి గాయాలు

Badar Khan Suri : అమెరికాలో భారతీయుడిపై బహిష్కరణ వేటు

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Mar 20 , 2025 | 09:51 PM

News Hub