AP Govt: వచ్చే ఏడాది నుంచి ఇంటర్ సిలబస్‌లో మార్పు..
ABN , Publish Date - Feb 18 , 2025 | 09:32 PM
AP Govt: చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఇంటర్మీడియెట్ పరీక్షల్లో కీలక సంస్కరణలు తీసుకురావాలని నిర్ణయించింది. అందులోభాగంగా సీబీఎస్ఈలో తరహాలో రెండేళ్ల కోర్సులో ఒక్కసారే పబ్లిక్ పరీక్షలు నిర్వహించడంపై కసరత్తు చేపట్టింది.

అమరావతి, ఫిబ్రవరి 18: రానున్న విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ సిలబస్‌లో ఏపీ ప్రభుత్వం కీలక మార్పులు తీసుకు రానుంది. అందులోభాగంగా ఇంటర్ మొదటి సంవత్సరం నూతన సిలబస్‌ను అమలులోకి తీసుకు వస్తుంది. మంగళవారం అమరావతిలో పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యపై ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంలో విద్య శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.
చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఇంటర్మీడియెట్ పరీక్షల్లో కీలక సంస్కరణలు తీసుకురావాలని నిర్ణయించింది. అందులోభాగంగా సీబీఎస్ఈలో తరహాలో రెండేళ్ల కోర్సులో ఒక్కసారే పబ్లిక్ పరీక్షలు నిర్వహించడంపై కసరత్తు చేపట్టింది. ఆ క్రమంలో సీబీఎస్‌ఈలో11వ తరగతికి పబ్లిక్ పరీక్షలు లేవు. కానీ 12వ తరగతిలో ఉంటాయి. జాతీయ ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సైతం 12వ తరగతి మార్కులనే ప్రామాణికంగా తీసుకొంటున్నారు.
దీంతో ఇంటర్ రెండో సంవత్సరంలో పబ్లిక్ పరీక్షలుంటే చాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే దీనిని ఏకపక్షంగా కాకుండా ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా తుది నిర్ణయం తీసుకోవాలని భావించింది. ఆ క్రమంలో జనవరి తొలి వారం చివరి నుంచి అదే మాసం 26వ తేదీ వరకు ఈ అంశంపై ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించింది.
అదీకాక ఒక్కసారే పరీక్షలు పెట్టడం వల్ల విద్యార్థులకు చదువుకునేందుకు అధిక సమయం లభించడంతోపాటు ఒత్తిడి తగ్గి ఉత్తీర్ణత శాతం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ఇంటర్మీడియట్ సిలబస్‌లో భారీగా మార్పులు చేర్పులూ తీసుకు రానుంది. ఈ సిలబస్‌ను ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుంచి అమలు చేయనున్నారు.
మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: ఐదు నెలల్లో బీజేపీదే అధికారం
Also Read: మొలకెత్తిన మెంతులు తింటే ఇన్ని లాభాలా..?
Also Read: జగన్‌కు చురకలంటించిన లోకేష్
Also Read: జగన్.. కడప జిల్లాలో పుట్టడం దరిద్రం
Also Read: విడదల రజినికి తాత్కాలిక ఊరట
Also Read: జగన్ రెడ్డికి పలు ప్రశ్నలు సంధించిన ఏపీ టీడీపీ చీఫ్
Also Read: వాయిదా పడనున్న కేబినెట్ భేటీ !
Also Read: జగన్ రెడ్డి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు
For AndhraPradesh News And Telugu News