Share News

AP High Court : జెత్వానీ కేసులో కాంతి రాణా, విశాల్‌ గున్నీకి ముందస్తు బెయిల్‌

ABN , Publish Date - Jan 08 , 2025 | 03:29 AM

సినీనటి కాదంబరి జెత్వానీ ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన కేసులో ఐపీఎస్‌ అధికారులు కాంతిరాణా తాతా, విశాల్‌ గున్నీకి హైకోర్టు...

AP High Court : జెత్వానీ కేసులో కాంతి రాణా, విశాల్‌ గున్నీకి ముందస్తు బెయిల్‌

  • షరతులతో మంజూరు చేసిన హైకోర్టు

  • కాంతి రాణా, విశాల్‌ గున్నీకి

  • జెత్వానీ కేసులో ముందస్తు బెయిల్‌

అమరావతి, జనవరి 7(ఆంధ్రజ్యోతి): సినీనటి కాదంబరి జెత్వానీ ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన కేసులో ఐపీఎస్‌ అధికారులు కాంతిరాణా తాతా, విశాల్‌ గున్నీకి హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ మంజూరుచేసింది. అప్పటి విజయవాడ ఏసీపీ హనుమంతరావు, దర్యాప్తు అధికారి సత్యనారాయణ, న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వర్లుకూ ఇదే ఊరట కల్పించింది. దర్యాప్తు అధికారి సంతృప్తి మేరకు పిటిషనర్లు ఒక్కొక్కరు రూ.50 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని స్పష్టం చేసింది. ప్రయాణ వివరాలను ముందుగా దర్యాప్తు అధికారికి తెలియజేయాలని, అవసరమైనప్పుడు దర్యాప్తుకు అందుబాటులో ఉండాలని.. దర్యాప్తునకు సహకరించాలని తేల్చిచెప్పింది. సాక్షులతో మాట్లాడవద్దని, వారిని ప్రభావితం చేయరాదని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కే కృపాసాగర్‌ మంగళవారం తీర్పు ఇచ్చారు.

Updated Date - Jan 08 , 2025 | 03:29 AM