Share News

GOD : రమణీయమైన కోన కణ్వాశ్రమం

ABN , Publish Date - Feb 25 , 2025 | 12:44 AM

పచ్చని ప్రకృతి రమణీ య దృశ్యాలతో పులకిస్తోంది కోనకణ్వాశ్రమం. ఉమ్మడి జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. దీనిని న్యామద్దల కోన, గుట్టూరు కోన అని కూడా పిలుస్తారు. కణ్వమహర్షి తపస్సు చేసిన స్థలం కావున కోన కణ్వాశ్రమం అనే పేరు వచ్చినట్టు పెద్దలు చెబుతుంటారు. ఈ క్షేత్రంలో ప్రముఖంగా మల్వేశ్వరస్వామి, పాం డురంగస్వామి, అయ్య ప్పస్వామి ఆంజనేయ స్వామి ఆలయాలు ఉ న్నాయి.

GOD : రమణీయమైన కోన కణ్వాశ్రమం
Statue of Kanvamaharshi in Ashram area

చెన్నేకొత్తపల్లి, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): పచ్చని ప్రకృతి రమణీ య దృశ్యాలతో పులకిస్తోంది కోనకణ్వాశ్రమం. ఉమ్మడి జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. దీనిని న్యామద్దల కోన, గుట్టూరు కోన అని కూడా పిలుస్తారు. కణ్వమహర్షి తపస్సు చేసిన స్థలం కావున కోన కణ్వాశ్రమం అనే పేరు వచ్చినట్టు పెద్దలు చెబుతుంటారు. ఈ క్షేత్రంలో ప్రముఖంగా మల్వేశ్వరస్వామి, పాం డురంగస్వామి, అయ్య ప్పస్వామి ఆంజనేయ స్వామి ఆలయాలు ఉ న్నాయి. మాతృశ్రీ ఆంజ నాదేవి సమాధి, నాగుల కట్ట, ధ్యాన మందిరం ప్ర ముఖంగా ఉన్నాయి. ఇక్కడ నిత్యాన్నదానం కొనసాగిస్తున్నారు. ప్రతిఏటా మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ మేరకు బుధవారం నుంచి రెండు రోజులపాటు జరిగే ఉత్సవాలకు ఆశ్రమ అధ్యక్షుడు శ్రీదత్తానందగిరి స్వామి ఆధ్వర్యం లో ఏర్పాట్లు చేశారు. బుధవారం శివపార్వతుల కల్యాణోత్సవంతో పాటు రెండో రోజు గురువారం సమారాధనతో ఉత్సవాలు ముగుస్తా యి. ఈ ఉత్సవాలకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Feb 25 , 2025 | 12:46 AM