CM Chandrababu Cabinet: మంత్రులకు ర్యాంకులు.. టాప్.. లాస్ట్ ఎవరంటే..?
ABN , Publish Date - Feb 06 , 2025 | 05:36 PM
CM Chandrababu Cabinet Ranking: చంద్రబాబు సారథ్యంలో కేబినేట్ బేటీ జరిగింది. ఈ సందర్భంగా మంత్రులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఆ క్రమంలో ఫైళ్ల క్లియరెన్స్‌లో మంత్రులు వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమరావతి, ఫిబ్రవరి 06: మొదటి ఆరు నెలలు ఫర్వాలేదు.. ఇక ఊరుకోనని మంత్రులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కేబినెట్ భేటీ అనంతరం మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రుల పనితీరును సీఎం చంద్రబాబు వివరించారు. తాను 6వ స్థానంలో ఉన్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఫైల్స్ వేగంగా క్లియర్ చేయాలని మంత్రులకు సీఎం సూచించారు. అయితే ఫైల్స్ క్లియరెన్స్‌లో తొలి స్థానంలో ఎన్ఎండీ ఫరూఖ్ ఉంటే.. చివరి స్థానంలో వాసంశెట్టి సుభాష్ ఉన్నారన్నారు.
ఇక మంత్రులు వరుసగా.. కందుల దుర్గేష్ (2), కొండపల్లి శ్రీనివాస్ (3), నాదెండ్ల మనోహర్ (4), డోలా బాల వీరాంజనేయులు (5), సీఎం చంద్రబాబు (6), సత్యకుమార్ (7), లోకేష్ (8), బీసీ జనార్థన్ రెడ్డి (9), పవన్ కల్యాణ్ (10), సవిత (11), కొల్లు రవీంద్ర (12), గొట్టిపాటి రవికుమార్ (13), నారాయణ (14), టీజీ భరత్ (15), ఆనం రాంనారాయణరెడ్డి (16), అచ్చెన్నాయుడు (17), రాంప్రసాద్ రెడ్డి (18), గుమ్మడి సంధ్యారాణి (19), వంగలపూడి అనిత (20), అనగాని సత్యప్రసాద్ (21), నిమ్మల రామానాయుడు (22), కొలుసు పార్థసారధి (23), పయ్యావుల కేశవ్ (24), చివరి 25వ స్థానంలో వాసంశెట్టి సుభాష్ ఉన్నట్లు సీఎం చంద్రబాబు వివరించారు.
తక్కువ ఫైల్స్ ఉండే వాళ్లు కూడా క్లియరెన్స్‌లో వెనుకబడి ఉంటే ఎలా? అంటూ వెనుకబడిన మంత్రులను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. మధ్యాహ్న భోజన పథకానికి న్యాణ్యమైన బియ్యం ఇవ్వాలని మంత్రులను ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్ శాఖపై ఫిర్యాదులు వస్తున్నాయి.. వాటిని తగ్గించాల్సి ఉందన్నారు. రెవెన్యూపై ఫిర్యాదులను త్వరలో తగ్గిస్తామని ఈ సందర్భంగా ఆ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ పేర్కొన్నారు. ఇన్‌చార్జ్ మంత్రులు ఇసుక, మద్యంలో ఫిర్యాదులపై వెంటనే సమీక్షించాలన్నారు. బనకచర్ల ప్రాజెక్ట్‌పై వెంటనే నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. రెండు, మూడు నెలల్లో విధివిధానాలు ఖరారు చేయాలని ఆదేశించారు.
Also Read: మాదాపూర్‌లో మళ్లీ డ్రగ్స్ పట్టివేత
2028 లోపు బనకచర్ల ప్రాజెక్ట్ పూర్తి చేయాలన్నారు. అలాగే ఇన్‌చార్జ్ మంత్రులు సూర్యఘర్‌పై దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. అందులోభాగంగా 10 లక్షల కనెక్షన్లు లక్ష్యంగా పెట్టుకోవాల్సి ఉందని చెప్పారు. హైదరాబాద్‌లో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలా.. రాష్ట్రంలో ఓ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉందన్నారు. అందుకోసం మంత్రులు లోకేష్, పయ్యావుల, నారాయణతో కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతపురంలో కస్టమ్స్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ పరిశీలించాలని మంత్రులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
Also Read: విద్యుత్ ఛార్జీలు ఒక్క పైసా పెంచడానికి వీలు లేదు
అయితే ఫైల్స్ క్లియరెన్స్‌లో దేశంలోనే రాష్ట్రం మూడో స్థానంలో ఉన్నామన్నారు. శాఖలపరంగా ఇకపై మంత్రులు పని తీరు పెంచాల్సి ఉందన్నారు. కేంద్ర బడ్జెట్ వచ్చింది.. మార్చిలో మన బడ్జెట్ వస్తుందని తెలిపారు. ఢిల్లీలోని వివిధ శాఖల్లో మిగిలి పోయిన బడ్జెట్‌ను మనం తెచ్చుకోవాల్సి ఉందన్నారు. జీఎస్‌డీపీపై దృష్టి కేంద్రీకరించేందుకు సచివాలయం సిబ్బందిలో.. మండలానికి ఒకరు చొప్పున పెట్టుకోవాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Also Read: అక్రమవలస దారులకు సంకెళ్లు.. స్పందించిన విదేశాంగ మంత్రి
మరోవైపు వాట్సాప్ గవర్నెన్స్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. డీఎస్సీ స్కూల్ ప్రారంభం కాక ముందే తల్లికి వందనం ఇస్తాని తెలిపారు. అలాగే ద్రవ్యోల్బణంపై రెగ్యులర్‌గా మానిటరింగ్ జరిగాల్సి ఉందన్నారు. అయితే దావోస్‌లో మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చిందని చెప్పారు. అయితే అమెరికా నుంచి మన వారిని వెనక్కి పంపుతున్నారంటూ ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు మంత్రులు తెలిపారు. తెలుగు వాళ్లకు పెద్దగా ఇబ్బంది ఉండక పోవచ్చన్నారు. ఏపీసీవోఎస్ ద్వారా కాకుండా ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని.. శాఖల వారీగా చేసుకోమని.. అలాగే ఏజెన్సీలో ద్వారా చేసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
For AndhraPradesh News And Telugu News