Minister Ram Mohan Naidu : బాబు కష్టాన్ని దావోస్‌లో ప్రత్యక్షంగా చూశా
ABN , Publish Date - Jan 28 , 2025 | 06:00 AM
టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వినతుల స్వీకరణలో పాల్గొనేందుకు సోమవారం వచ్చిన ఆయన విలేకరులతో మా ట్లాడారు.

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
అమరావతి, జనవరి 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రం కోసం చంద్రబాబు ఎంత కష్టపడుతున్నారో దావోస్‌లో తాను ప్రత్యక్షంగా చూశానని, ఆయనతో కలిసి రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడంలో భాగస్వామ్యం కావడం తన పూర్వజన్మ సుకృతమని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వినతుల స్వీకరణలో పాల్గొనేందుకు సోమవారం వచ్చిన ఆయన విలేకరులతో మా ట్లాడారు. గడచిన ఐదేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమా రాలేదని, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రావడాన్నిబట్టి చంద్రబాబు బ్రాండ్ వాల్యూ తెలుస్తోందన్నారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ దావోస్‌లో మాట్లాడుతూ.. మహారాష్ట్రకు ముంబై, తెలంగాణకు హైదరాబా ద్ ఎలానో ఏపీకి చంద్రబాబు అలా అని వ్యా ఖ్యానించడం చంద్రబాబుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇమేజ్‌ను తెలుపుతోందన్నారు. టీడీపీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం లోకేశ్ యువగళం పాదయాత్ర అని రామ్మోహన్ నా యుడు పేర్కొన్నారు. ఏడాది క్రితం ఏపీని గుర్తు చేసుకుంటే అంధకారాంధ్రప్రదేశ్ గుర్తుకొస్తుంద ని, అప్పట్లో ప్రజలకు ప్రశ్నించే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. నాడు ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా లెక్క చేయకుండా ప్రజల్లో ధైర్యా న్ని నింపేందుకు లోకేశ్ ముందడుగు వేశారని, 226 రోజులపాటు నిరంతరాయంగా పాదయా త్ర చేశారని గుర్తు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan: నువ్వు మరిన్ని రికార్డులు నెలకొల్పాలి.. దేవాన్ష్‌కు పవన్ అభినందనలు
Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
Read Latest AP News And Telugu News