CM Chandrababu: శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు,లోకేష్,కుటుంబ సభ్యులు
ABN , Publish Date - Mar 21 , 2025 | 09:09 AM
సీఎం చంద్రబాబు మనుమడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఉదయం చంద్రబాబు కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత వెంగమాంబ అన్నదాన వితరణ కేంద్రంలో కుటుంబసభ్యలతో కలిసి ప్రసాదాలు పంపిణీ చేశారు. ప్రసాదాల పంపిణీకి ఒకరోజు అయ్యే ఖర్చును దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా టీటీడీ అన్నదాన ట్రస్ట్‌కు చంద్రబాబు విరాళంగా అందజేశారు.

తిరుమల: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), లోకేష్ (Lokesh),కుటుంబ సభ్యులు (Family Members) శుక్రవారం ఉదయం తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు (Special Pujas) చేశారు. స్వామివారి దర్శనార్ధం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయంలోకి వెళ్ళారు. చంద్రబాబు నుదుటున నామం.. సంప్రదాయ వస్త్ర ధారణతో శ్రీవారి దర్శనానికి వచ్చారు. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా సిబ్బంది ఆలయ పరిసర ప్రాంతాల్లోని అన్ని గేట్లను మూసి వేశారు. ఆలయ పరిసర ప్రాంతాల్లోకీ భక్తులను ఎవర్ని అనుమతించలేదు. రెండు రోజులపాటు చంద్రబాబు తిరుమలలో పర్యటించనున్నారు.
దేవాన్ష్ పుట్టినరోజు..
సీఎం చంద్రబాబు మనుమడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం చంద్రబాబు కుటుంబంతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు.తర్వాత వెంగమాంబ అన్నదాన వితరణ కేంద్రంలో కుటుంబసభ్యలతో కలిసి ప్రసాదాలు పంపిణీ చేశారు. ప్రసాదాల పంపిణీకి ఒకరోజు అయ్యే ఖర్చును దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా టీటీడీ అన్నదాన ట్రస్ట్‌కు చంద్రబాబు విరాళంగా అందజేశారు. అనంతరం టీటీడీ ఉన్నతాధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులతో తిరుమల క్షేత్ర అభివృద్ధిపై సమీక్ష నిర్వహిస్తారు. కాగా తిరుమలకు చేరుకున్న సీఎం చంద్రబాబుకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు ఇతర ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు.
Also Read..:
ఆ అధికారులపై బెజవాడ ఎమ్మెల్యే బూతులు
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా టీటీడీ అన్నదాన ట్రస్ట్‌కు చెక్కు ఇచ్చారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు సీఎం హోదాలో రెండోసారి తిరుమల పర్యటనకు వచ్చారు. తిరుమల నుంచే ప్రక్షాళన చేపడతానని చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తిరుమలలో జరిగిన మార్పులు, భక్తులకు అందతున్న సేవలపై అధికారులతో సీఎం చర్చించనున్నారు. లడ్డూ ప్రసాదాల నాణ్యత, అన్నప్రసాద కేంద్రాల్లో ప్రసాదాల వితరణ, క్యూకాంప్లెక్స్‌లో భక్తులకు అందుతున్న సేవలపై ఆరా తీయనున్నట్లు సమాచారం. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ గురువారమే తిరుమలకు వచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
For More AP News and Telugu News