CM Chandrababu: స్వర్ణ కుప్పం విజన్-2029 ఆవిష్కరణ.. సీఎం చంద్రబాబు ఏం చెప్పారంటే..
ABN , Publish Date - Jan 06 , 2025 | 06:02 PM
స్వర్ణ కుప్పం విజన్-2029 డాక్యుమెంటరీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా ఆవిష్కరించారు. కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్యుమెంటరీని సీఎం చంద్రబాబు విడుదల చేశారు.
చిత్తూరు: "స్వర్ణ కుప్పం విజన్-2029" (Swarna Kuppam Vision-2029) డాక్యుమెంటరీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఘనంగా ఆవిష్కరించారు. కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీ (Dravida University) ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్యుమెంటరీని సీఎం చంద్రబాబు విడుదల చేశారు. అంతకుముందు నడిమూరు గ్రామంలో ‘సూర్య ఘర్’ (Suryagarh) సోలార్ పైలట్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు, మంత్రులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
స్వర్ణ కుప్పం విజన్-2029 ఆవిష్కరణ అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. "అసాధ్యం అన్న వాటిని సుసాధ్యం చేసి నిరూపించిన పార్టీ తెలుగుదేశం. విజన్-2020 తయారు చేసినప్పుడు చాలా మంది విమర్శించారు. ఒక డైరెక్షన్ లేకుండా జీవితాల్లో ఎవ్వరూ పైకి రాలేరు. ఏ వ్యక్తి అయినా సరే పద్ధతి ప్రకారం పని చేయగలిగితే జీవితంలో ఏదైనా సాధించే స్థితికి చేరుతారు. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ప్రజలకు శాపాలుగా మారుతాయి. సరైన నిర్ణయాలు తీసుకుంటే చరిత్ర మారిపోయే పరిస్థితి ఉంటుంది. మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు దేశ ప్రధాని అయిన తర్వాత అనేక ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఈ సంస్కరణల వల్ల ఆయన దేశం దశదిశ మార్చారన్న విషయం మనందరం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన్మోహన్ సింగ్ కూడా మంచి ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి మరవలేని వ్యక్తిగా నిలిచారు.
ద్రవిడ యూనివర్సిటీ రావడానికి కారణం నందమూరి తారక రామారావు. బాగా కష్టపడితే 2030 నాటికి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచంలోనే భారత్ నెంబర్ వన్‌గా నిలుస్తుంది. అమెరికాలో అమెరికన్ల తలసరి ఆదాయం కంటే భారతీయులు, తెలుగు వారిదే ఎక్కువ. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు చాలా స్పష్టంగా ఐదేళ్లకు నిర్దిష్టమైన ప్రణాళికలు రచించి దేశంలో ఎక్కడా జరగనంత అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్‌లో చేశాం. ఆ తర్వాత వచ్చిన వైసీపీ వల్ల నాలుగు శాతం అభివృద్ధి తగ్గిపోయింది. విజన్-2029కు సంబంధించి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తామనే దానిపై నిర్దిష్టమైన టార్గెట్లు పెట్టుకున్నాం. నేను ఏదైనా లక్ష్యం పెట్టుకుంటే సాధించే వరకూ ఎక్కడా వెనకాడను. ఆంధ్రప్రదేశ్ స్వర్ణ కమ్యూనిటీస్ డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలనే దానిపైనా విజన్ చేశాం. పేదవాళ్లు అనుకున్నంత ప్రగతిని సాధించలేకపోయారు. అందుకే ఈ కొత్త విజన్ పెట్టుకున్నామని" చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Nara Lokesh: విడాకులు ఉండవు.. పొత్తుపై తేల్చేసిన లోకేష్
Palnadu: తురకా కిషోర్ సోదరులను జైలుకు తరలించిన పోలీసులు