Share News

Tirumala: బ్రేక్ దర్శనం టికెట్స్ కోసం గూగుల్ పే.. తర్వాత ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Jan 16 , 2025 | 12:47 PM

తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనం టికెట్స్ ఇప్పిస్తామని దళారులు చెప్పిన మాటలు నమ్మిన బెంగళూరుకు చెందిన భక్తులు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా శరవణ, వేణు గోపాల్ అనే అకౌంట్లకు రూ. లక్ష 50 వేలు పంపారు. అనంతరం దళారుల మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి.

Tirumala: బ్రేక్ దర్శనం టికెట్స్ కోసం గూగుల్ పే.. తర్వాత ఏం జరిగిందంటే..
Tirumala Break Dharshan

తిరుమల: స్వామివారి బ్రేక్ దర్శనం (Break Dharshan) కల్పిస్తామని చెప్పి దళారులు భక్తులను మోసం చేశారు. బెంగళూరుకు చెందిన భక్తులు మొబైల్ ద్వారా దళారులను సంప్రదించినట్లు సమాచారం. దీంతో దళారులు వారిని మోసం చేద్దామని పథకం వేశారు. బ్రేక్ దర్శనం టిక్కెట్స్ ఇప్పిస్తామని దళారులు చెప్పడంతో.. నమ్మిన భక్తులు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా శరవణ, వేణు గోపాల్ అనే అకౌంట్లకు రూ. లక్ష 50 వేలు పంపారు. నగదు పంపిన అనంతరం దళారుల మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. దీంతో మోసపోయామని గుర్తించిన భక్తులు విజిలెన్స్ వింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. భక్తుల ఫిర్యాదు మేరకు వింగ్ అధికారులు విచారణ చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ఈ వార్త కూడా చదవండి.

గుడివాడలో ప్రాణం తీసిన సిగరెట్...


కాగా సంక్రాంతి పండుగ (Sankranti festival) నేపథ్యంలో తిరుమల (Tirumala)లో భక్తుల (Devotees) రద్దీ (Crowd) కొనసాగుతోంది. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం(Vaikuntha Dwara Darshan) కొనసాగుతోంది. భక్తులు క్యూ లైన్లలో నిలుచుని స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు (TTD Officers) ఏర్పాట్లు చేశారు. కాగా ఈ నెల 19వ తేది వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. మరోవైపు తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకేన్ల జారీ కొనసాగుతోంది. 18వ తేదీకి సంబంధించిన దర్శన టోకెన్లను గురువారం భక్తులకు టీటీడీ అధికారులు జారీ చేశారు. కాగా ఆరు రోజుల్లో నాలుగు లక్షల 8 వేల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు.


తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు..

కాగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం (10వ తేదీ) వేకువజాము నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. గురువారం అర్ధరాత్రి 12.05 గంటలకు ఆలయాన్ని తెరిచిన అర్చకులు ధనుర్మాస కైంకర్యాలను శాస్ర్తోక్తంగా నిర్వహించారు. శుక్రవారం వేకువజాము 3.50 గంటల నుంచి ఉదయం 8.15 గంటల వరకు వీఐపీలకు వైకుంఠద్వార దర్శనాలు చేయించారు. ఆ తర్వాత సర్వదర్శన భక్తులను అనుమతించారు. స్లాట్లవారీగా అర్థరాత్రి వరకు వైకుంఠద్వార దర్శనాలను కల్పించారు. ఇక, వైకుంఠ ఏకాదశి అయినప్పటికీ తిరుమలలో మోస్తరుగానే భక్తుల రద్దీ కొనసాగింది. ఏకాదశి సందర్భంగా ఉదయం స్వర్ణరథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి స్వర్ణరథంలో కొలువుదీరి మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఇక, శ్రీవారి ఆలయం ముందు ఎక్కడికక్కడ గేట్లు వేయడంతో చిన్నపిల్లలు, వృద్ధులు ముందుకు వెళ్లేందుకు ఇబ్బంది పడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి..

శ్రీసత్యసాయి జిల్లాలో అమానుష ఘటన..

తిరుమలలో భక్తుల రద్దీ.. వైకుంఠ ద్వారా దర్శనం

కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు.. ఎందుకంటే..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 16 , 2025 | 12:47 PM