Share News

TDP activist killed: ప్రాణహాని ఉందంటూ వీడియో.. నాలుగు రోజుల్లోనే దారుణం

ABN , Publish Date - Mar 15 , 2025 | 02:05 PM

TDP activist killed: చిత్తూరు జిల్లాలో టీడీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. తనకు ప్రాణహానీ ఉందంటూ వీడియో రిలీజ్ చేసిన నాలుగు రోజుల్లోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం సంచలనం రేపుతోంది.

TDP activist killed: ప్రాణహాని ఉందంటూ వీడియో.. నాలుగు రోజుల్లోనే దారుణం
TDP activist killed

చిత్తూరు, మార్చి 15: ఏపీలో వరుసగా టీడీపీ నేతల (TDP Leaders) హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కర్నూలులో టీడీపీ నేత సంజన్న హత్య జరిగి 24 గంటలు గడవక ముందే మరో టీడీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. చిత్తూరు జిల్లాలో (Chittoor District) ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని పుంగనూరు మండలం కృష్ణాపురంలో టీడీపీ కార్యకర్త రామకృష్ణను ప్రత్యర్థులు కిరాతకంగా హత్య చేశారు. పాత కక్షలతో మాజీ వాలంటీర్, వైసీపీ కార్యకర్త వెంకటరమణ కొడవలితో రామకృష్ణని నరికాడు. తీవ్రంగా గాయపడిన రామకృష్ణను మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. రామకృష్ణ పరిస్థితి విషమించడంతో తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే అతడు కన్నుమూశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పుంగనూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


హత్యకు గురైన రామకృష్ణ.. నాలుగైదు రోజుల క్రితం ఓ వీడియోను రిలీజ్ చేశారు. వైసీపీ వ్యక్తుల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ అందులో తెలిపారు. ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా వన్ సైడ్‌గా వ్యవహరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు టీడీపీ కార్యకర్త. వీడియో రిలీజ్ చేసిన నాలుగు రోజుల్లోనే ఈరోజు రామకృష్ణ దారుణ హత్యకు గురవడం సంచలనం రేపింది.


పెద్దిరెడ్డి ఆగడాలను సహించం: పల్లా

palla-srinivas.jpg

పుంగనూరులో జరిగిన టీడీపీ నేత రామకృష్ణ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఈ అమానవీయ ఘటన పుంగనూరులో వైసీపీ అరాచకాలకు నిదర్శనమన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించి ఇంటికి పంపినా ఆ పార్టీ నేతలకు బుద్ధి రాలేదని మండిపడ్డారు. భయభ్రాంతులతో తన ఆధిపత్యాన్ని కొనసాగించాలనే పెద్దిరెడ్డి ఆగడాలను సహించమన్నారు. బాధిత కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు. టీడీపీ ప్రభుత్వం ఇలాంటి హత్య రాజకీయాలను కూకటివేళ్లతో పెకిలించివేస్తుందని తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.


కాగా.. అటు కర్నూలులోనూ టీడీపీ నేత సంజన్న దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. జిల్లాలోని శరీన్‌నగర్‌కు చెందిన సంజన్నను కొందరు వ్యక్తులు కత్తులతో నరికి చంపారు. దుండగుల దాడిలో టీడీపీ నేత తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించగా... అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. సంజన్న గతంలో వైసీపీలో పనిచేశారు. కాటసాని రాంభూపాల్ రెడ్డితో విబేధాల కారణంగా టీడీపీలో చేరారు. అయితే శరీన్‌నగర్‌కు చెందిన రామాంజనేయులు (అంజి)తో సంజన్నకు కొంతకాలంగా విబేధాలు ఉన్నాయి. ఈ క్రమంలో నిన్న (శుక్రవారం) రాత్రి మెడిటేషన్ సెంటర్‌కు వెళ్లి వస్తుండగా.. అంజి, అతడి అనుచరులు దారి కాసి మరీ సంజన్నపై దాడి చేశారు. కత్తులతో కిరాతంగా నరకడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోపే సంజన్న ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎలాంటి గొడవలు జరగకుండా శరీన్‌నగర్‌లో పికెటింగ్ ఏర్పాటు చేశారు.


ఇవి కూడా చదవండి...

Justice for Viveka: ఆరేళ్లుగా పోరాడుతున్నా.. వివేకా కుమార్తె కన్నీరు

CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబు ఫుల్ బిజీ..పూర్తి షెడ్యూల్ ఇదే

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 15 , 2025 | 04:07 PM