Share News

Tragedy.. తిరుపతి జిల్లా: నారావారిపల్లెలో విషాదం

ABN , Publish Date - Jan 19 , 2025 | 10:57 AM

తిరుపతి జిల్లా: చంద్రగిరి మండలం, నారావారిపల్లెలో విషాదం చోటు చేసుకుంది. పంటపొలాల్లోకి ఏనుగుల రావడంతో వాటిని తిరిమేందుకు గ్రామస్తులతోపాటు ఉప సర్పంచ్ మార్పూరి రాకేష్ కూడా వెళ్లాడు. ఏనుగుల గుంపు పారిపోగా.. ఓ గున్న ఏనుగు ఉండిపోయింది. దాని అరుపులతో మళ్లీ ఏనుగుల గుంపు వెనక్కి వచ్చాయి. ఈ క్రమంలో గ్రామస్తులు పారిపోగా.. రాకేష్ అక్కడే ఉన్నాడు. గుంపులో ఓ ఏనుగు రాకేష్‌ను తొండంతో పట్టుకుని నేలకేసి కొట్టింది.

Tragedy.. తిరుపతి జిల్లా: నారావారిపల్లెలో విషాదం

తిరుపతి జిల్లా: చంద్రగిరి మండలం (Chandragiri Mandal), నారావారిపల్లె (Naravaripalle)లో విషాదం (Tragedy) చోటు చేసుకుంది. ఏనుగుల దాడి (Elephant attack)లో ఉప సర్పంచ్ మార్పూరి రాకేష్ (Deputy Sarpanch Marpuri Rakesh) మృతి (Death) చెందాడు. అర్ధరాత్రి గ్రామానికి సమీపంలోని పంటపొలాల్లోకి ఏనుగుల గుంపు వచ్చింది. దీంతో ఎనుగును బెదిరించడానికి అటవీశాఖ అధికారులు గ్రామస్తులతో కలిసి రాకేష్ వెళ్లాడు. బెదిరించే క్రమంలో ఏనుగులు ఒక్కసారిగా దాడి చేశాయి. అందరూ తప్పించుకోగా ఓ ఏనుగు రాకేష్‌ను తొండంతో పట్టుకుని నేలకేసి కొట్టింది. దీంతో రాకేష్ అక్కడిక్కడే మృతి చెందాడు. కాగా రాకేష్ సీఎం చంద్రబాబు కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే పులవర్తి నాని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. చురుకైన యువనేతను కోల్పోయామని ఎమ్మెల్యే, గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. కాగా మార్పూరి రాకేష్ భార్య గర్బిణి.

ఈ వార్త కూడా చదవండి..

ఏపీతో మూడు రాష్ట్రాలతో పోటీ


పంట పొలాల్లోకి వచ్చిన ఏనుగుల గుంపును గ్రామస్తులు కొంత దూరం తరిమారు. అయితే పిల్ల ఏనుగు ఉండిపోయింది. ఆ గున్న ఏనుగు అరుపులతో వెళ్లిపోయిన ఏనుగులు మళ్లీ తిరిగి వచ్చాయి. దీంతో గ్రామస్తులు తమ వద్ద ఉన్న టార్చి లైట్లు ఆపివేశారు. రాకేష్ మాత్రం టార్చి లైట్ ఆపలేదు. షూ, తెల్ల చొక్కా వేసుకున్నాడు. వైట్ కలరంటే ఏనుగులకు శత్రుభావం ఉంటుంది. చాలా వరకు అటవీశాఖ సిబ్బంది కూడా తెల్ల చొక్క వేసుకుని వెళ్లవద్దని హెచ్చరిస్తుంటారు. వైట్ డ్రస్ వేసుకుంటే ఏనుగులు చాలా తీవ్రంగా రియాక్టు అవుతాయని శాస్త్రీయమైన అధ్యాయనం ఉంది. ఈ క్రమంలో రాకేష్ తెల్ల చొక్కా వేసుకోడం, టార్చి లైట్ కూడా ఆపకపోవడం, షూ వేసుకోవడంతో చెట్టు ఎక్కలేకపోయాడు.. అలాగే గున్న ఏనుగు అరుపులతో వెళ్లిపోయిన ఏనుగులు తిరిగి వచ్చి.. టార్చిలైటు వేసుకుని ఉన్న రాకేష్‌ను ఓ ఏనుగు పట్టుకుని నేల కేసి కొట్టింది. దీంతో అతనిని గ్రామస్తులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ రాకేష్ మృతి చెందాడు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పులవర్తి నాని అటవిశాఖ అధికారులను పిలిచి.. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రభుత్వం నిరుపేదల గురించి ఆలోచించదా..: హరీష్‌రావు

మనసులో మాట చెప్పిన రఘురామ..

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్ళే..

శ్రీవారి ఆలయంలో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనాలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 19 , 2025 | 10:57 AM