BR Naidu: వాస్తవాలు తెలుసుకుని రాయండి
ABN , Publish Date - Jan 13 , 2025 | 01:18 PM
BR Naidu: తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడి చికిత్స పొంది కోలుకున్న భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించి స్వస్థలాలకు పంపించామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. టీటీడీ బోర్డు సభ్యులు మూడు ప్రత్యేక బృందాలుగా వెళ్లి మృతుల కుటుంబాలకు చెక్కులను అందించారని తెలిపారు.
తిరుమల, జనవరి 13: వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఏర్పాటు చేసిన టోకెన్ కౌంటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (TTD Chairman BR Naidu) మరోసారి స్పందించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. జనవరి 8న దురదృష్టకర సంఘటన జరిగిందని...అది చాలా బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనకు గాయపడి చికిత్స పొంది కోలుకున్న భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించి స్వస్థలాలకు పంపించామన్నారు.
టీటీడీ బోర్డు సభ్యులు మూడు ప్రత్యేక బృందాలుగా వెళ్లి మృతుల కుటుంబాలకు చెక్కులను అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా పాల్గొన్నారని.. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సుమారు 31 మందికి చెక్కులు ఇవ్వడం జరిగిందని... మరో 20 మందికి ఇవ్వాల్సి ఉందన్నారు. వారికి మరో రెండు రోజుల్లో చెక్కులను అందజేస్తామన్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా ఆవేదన వ్యక్తం చేశారన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను భక్తులు నమ్మొద్దని తెలిపారు. కొంత మంది పనిగట్టుకొని తన మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. వాస్తవం తెలుసుకొని వార్తలు రాయాలని విజ్ఞప్తి చేస్తున్నానని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పేర్కొన్నారు.
Kite Festival: పతంగుల సందడి షురూ.. కైట్స్ ఎగరేసిన మాజీ మంత్రి
కాగా.. ఈనెల 8న వైకుంఠ ద్వార దర్శనాల కోసం టీటీడీ తొమ్మిది ప్రాంతాల్లో 90 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ముందుగా గురువారం (జనవరి 10) తెల్లవారుజామున కౌంటర్లు తెరవాలని భావించినప్పటికీ భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో బుధవారం రాత్రికే కౌంటర్లను ఓపెన్ చేయాలని నిర్ణయించింది టీటీడీ. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో మూడు ప్రాంతాల్లో ఒక్కసారిగా గేట్లు తెరుచుకున్నాయి. భక్తులు కౌంటర్ కేంద్రాల వద్దకు దూసుకెళ్లారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. బైరాగిపట్టెడ, విష్ణు నివాసం, ఇందిరా మైదానం కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఊపిరాడక మహిళలు అల్లాడి పోయారు. చివరకు ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. వారిని వెంటనే రుయా, స్విమ్స్ ఆస్పత్రులకు తరలించింది. చికిత్స అందజేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించింది.
పండుగ వేళ ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త
రాష్ట్ర మంత్రులు ఆస్పత్రుల వద్దకు చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. అలాగే మృతుల కుటుంబసభ్యులను ఓదారు. మృతి చెందిన కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది సర్కార్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా బాధితులను పరామర్శించారు. సీఎం చంద్రబాబు ఘటన స్థలికి చేరుకుని అక్కడి ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ పద్దతిగా పనిచేయాలని అన్నారు. గత ప్రభుత్వం రూల్స్‌ను ఎందుకు పాటిస్తున్నారని ప్రశ్నించారు. ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను చంద్రబాబు హెచ్చరించారు. అయితే చంద్రబాబు పరామర్శకు వచ్చిన సమయంలో తమకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని క్షతగాత్రులు ఆయనను కోరారు. దీంతో వారి వినతికి మనసు చెలించిన సీఎం.. అందరకి వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
కశ్మీర్‌లో జెడ్-మోడ్ టన్నెల్ ప్రారంభం..
పండగపూట బిగ్ షాక్.. ఆ ప్రాంతాల్లో వాటర్ బంద్..
Read Latest AP News And Telugu News