Share News

Tirumala: తిరుమలలో చిరుత.. టీటీడీ ఉద్యోగికి తీవ్రగాయాలు.. బాబోయ్..

ABN , Publish Date - Jan 11 , 2025 | 06:38 PM

తిరుమలలో చిరుత సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. అలిపిరి వద్ద ద్విచక్రవాహనంపై వెళ్తున్న టీటీడీ ఉద్యోగికి చిరుత కనిపించింది. చిరుతను చూడగానే అతను తీవ్ర భయాందోళనకు గురయ్యాడు.

Tirumala: తిరుమలలో చిరుత.. టీటీడీ ఉద్యోగికి తీవ్రగాయాలు.. బాబోయ్..
Leopard in Tirumala

తిరుపతి: తిరుమల(Tirumala)లో చిరుత (Leopard) సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. అలిపిరి వద్ద ద్విచక్రవాహనంపై వెళ్తున్న టీటీడీ ఉద్యోగి (TTD Employee)కి చిరుత కనిపించింది. చిరుతను చూడగానే అతను తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. దీంతో ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. ప్రమాదంలో బాధితుడికి తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుత సంచారంపై భక్తులను అప్రమత్తం చేశారు.


అలిపిరి సమీపంలో చిరుత సంచరిస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తులందరూ అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు. మరోవైపు చిరుత సంచారంపై అటవీశాఖ అధికారులకు టీటీడీ సిబ్బంది సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు.. చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దాన్ని పట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రాప్ కెమెరాలు అమర్చడం సహా బోన్ ఏర్పాటు చేయడం వంటి అంశాలపై చర్చిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

CM Chandrababu: గ్రీన్ ఎనర్జీ రూపంలో ఏపీకి రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు

TTD: వారి ఇళ్లకు రేపట్నుంచి వెళ్లనున్న టీటీడీ పాలకమండలి సభ్యులు.. ఎందుకంటే..

Updated Date - Jan 11 , 2025 | 08:02 PM