CM Chandrababu: ఇకపై సహించను.. ఆ మంత్రులకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్..
ABN , Publish Date - Feb 11 , 2025 | 06:41 PM
మరోసారి సీఎం చంద్రబాబు మంత్రులకు క్లాస్ తీసుకున్నారు. సమయపాలనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి మంత్రులు, కార్యదర్శలు సరైన సమాయానికి రాకపోవడంతో మండిపడ్డారు.

అమరావతి: మంత్రులు, కార్యదర్శులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి 5 నిముషాలు ముందుగానే వచ్చిన చంద్రబాబు మీటింగ్‌కు మంత్రులు, కార్యదర్శులు సరైన సమయానికి రాకపోవడంతో సీఎం సీరియస్ అయ్యారు. వారి కోసం 10 నిముషాల సేపు ఐదో బ్లాక్ లో వేచి ఉన్నారు. సమావేశాలకు సైతం సమయం పాటించకపోవటంపై సీఎం అందరికీ క్లాస్ తీసుకున్నారు. ఇక నుంచి ఈ తరహా వ్యవహారాలను సహించబోమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. స్మార్ట్ వర్క్ చేస్తూనే సమయ పాలన కూడా చేయాలని మంత్రులు, అధికారులకు సూచించారు.