Collectors Conference: కలెక్టర్ల ముగింపు సమావేశంలో సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Mar 26 , 2025 | 10:01 PM
Collectors Conference: రాజధాని అమరావతిలో రెండు రోజుల పాటు జిల్లా కలెక్టర్ల సమావేశం జరిగింది. రెండు రోజు బుధవారం జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో ఇన్ని సార్లు ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రిని కలిసింది లేదన్నారు.

అమరావతి, మార్చి 26: రాష్ట్రంలో నాశనమైన ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు ఇస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నా లైఫ్‌లో ఇన్ని సార్లు ప్రధానమంత్రిని, ఫైనాన్స్ మినిష్టర్‌ను కలవ లేదని ఆయన పేర్కొన్నారు. బుధవారం రెండో రోజు జిల్లా కలెక్టర్ల ముగింపు సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత కలెక్టర్ కాన్ఫరెన్స్‌కు ఈ సారి భిన్నంగా నిర్వహించామన్నారు. ఆ క్రమంలో మిమ్మల్ని ప్రజెంట్ చేయమన్నామని చెప్పారు.
కలెక్టర్ల సమస్యల పరిష్కారానికి ఉన్నారని అంతేగాని సమస్యలు చెప్పడానికి కాదని ఆయన తెలిపారు. ప్లానింగ్ బోర్డు ఛైర్మన్‌లు,సెక్రటరీలతో కుర్చోని సమస్యలు పరిష్కారం చేయాలని ఈ సందర్భగా జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు సూచించారు. తనకు సొల్యూషన్ కావాలని..సాకుల కాదన్నారు. తన వద్ద కూడా డబ్బులు ఉండక పోవచ్చునని.. అందుకోసం ఢిల్లీతో మాట్లాడుతున్నామని ఆయన వివరించారు.
కొత్త అప్పులు చేసి సూపర్ సిక్స్ ఇస్తున్నామని గుర్తు చేశారు. రూ. 9లక్షల 70 వేల అప్పులు డెట్ సర్వీసింగ్ ఇవ్వాల్సి ఉందన్నారు. క్రెడిబిలిటీ కాపాడుకుంటూ ఇన్ టైంలో అప్పులు చెల్లించాల్సి ఉందన్నారు. పాత అప్పులు అన్ని రీ స్వైపింగ్ చేస్తున్నామని.. రూ. 2 వేల కోట్లు మిగులుతాయన్న ఆ పని చేయాలన్నారు.
గతంలో నేను ఒక్కడినే పరిగేత్తే వాడినని.. కానీ ఈ సారి అలా కాదు నాతో పాటు మీరు పరిగెత్తాలని జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు చమత్కరించారు. ఒకప్పుడు సెక్రటరీలు జీఎస్డీపీలు కూడా మర్చిపోయారని.. వారికి మళ్లీ ఆవి చెప్పాల్సి వచ్చిందన్నారు. రాష్ట్రంలో 20 వేల కిలోమీటర్లు రోడ్లు గుంటలు పూడ్చామని గుర్తు చేశారు. దీంతో పబ్లిక్ పాజిటివ్ పర్సప్షన్ కూడా చూస్తున్నామన్నారు. ఒక పక్క జీఎస్డీపీ, వెల్పేర్,సర్వీసెస్ అన్ని చూసుకుంటామని ఆయన వివరించారు.
నాలా ఫీజు అనేది పెద్ద అడ్డంకిగా మారిందన్నారు. దీని వల్ల రిజిష్ట్రేషన్లు ఆగిపోతున్నాయని..అభివృద్దికి ఆటంకంగా ఉండే చట్టాలు మనకు వద్దని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ఫీజును వేరే విధంగా సంపాదిస్తామన్నారు. జీరో పవర్టీ మన గోల్ అని.. హై నెట్ వర్క్ ఉన్న వాళ్ళు ముందుకు వచ్చేలా చూడాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. నా విజన్ డాక్యుమెంట్ వల్ల తెలంగాణలో ప్రస్తుతం హైయస్ట్ పెర్ క్యాపిటా ఇన్ కం పోందుతుందని చెప్పారు. దీనికి 25 ఏళ్లు పట్టిందని.. మనం 23 ఏళ్లుగా పెట్టుకున్నామని గుర్తు చేశారు.
ఐదు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లకు భవనాలు సిద్దం చేశామని తెలిపారు. దీంతో వన్ ప్యామిలీ వన్ ఎంట్రపెన్యూర్ అనేది మన లక్ష్యమన్నారు. ఆక్వాకి 1.50కే కరెంటు ఇస్తున్నామని..అయితే పోల్యూషన్ లేకుండా చేసే వారికే ఇస్తామని తెలిపారు. పుష్కారాల నిర్వహణకు ఇప్పటికే ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. నేను ముఖ్యమంత్రిని అయినా.. అలయెన్స్ పార్టనర్లు ఉన్నారని.. వీరిని మీరు గౌరవించాలని జిల్లా కలెక్టర్లకు వివరించారు.
ఒరిజినల్ థింకింగ్ మీ వద్ద నుండి రావాలని.. ప్రతి డిపార్టమెంట్‌లో మీ ఆలోచనలు ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు.రూ. 7 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి.. ప్రాజెక్టులు ఎక్సిక్యూట్ చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. ట్రబుల్ ఫ్రీగా ఉండాలి హెరాస్‌మెంట్‌గా ఉండకూడదని జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు హితవు పలికారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Lulu Group: లూలూ గ్రూప్‌నకు తిరిగి భూ కేటాయింపు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
Curd Rice:పెరుగన్నం తింటే లాభమా నష్టమా.. ఎందుకు తినాలి
Milk: పాలు తాగిన వెంటనే ఇవి తీసుకోంటే.. డేంజర్
Liquor Mixing : మందులోకి కూల్‌డ్రింక్ బెటరా.. వాటర్ బెటరా..
Cricket Match : క్రికెట్ చూస్తూ రెచ్చిపోతున్నారా ఈ వార్త మీ కోసమే
For AndhraPradesh News And Telugu News