Share News

Minister Payyavula Keshav : బకాయిలు క్లియర్‌!

ABN , Publish Date - Jan 12 , 2025 | 03:38 AM

సంక్రాంతి కానుకగా వివిధ వర్గాలకు చెల్లించాల్సిన రూ.6,700 కోట్ల మేర పెండింగ్‌ బకాయిలు, బిల్లుల విడుదలకు సీఎం చంద్రబా బు ఆమోదం తెలిపారు.

Minister Payyavula Keshav : బకాయిలు క్లియర్‌!

  • రూ.6,700 కోట్ల చెల్లింపునకు సీఎం ఆమోదం

  • ఇందులో ఒక్క ఉద్యోగులకే రూ.1,300 కోట్లు

  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు 788 కోట్లు

  • చిన్న కాంట్రాక్టర్ల బిల్లులకు రూ.586 కోట్లు

  • ఎన్టీఆర్‌ వైద్యసేవ ట్రస్ట్‌కు రూ.400 కోట్లు

  • ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ వెల్లడి

అమరావతి, జనవరి 11(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి కానుకగా వివిధ వర్గాలకు చెల్లించాల్సిన రూ.6,700 కోట్ల మేర పెండింగ్‌ బకాయిలు, బిల్లుల విడుదలకు సీఎం చంద్రబా బు ఆమోదం తెలిపారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై శనివారం ఉండవల్లిలోని నివాసంలో సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉద్యోగులు, పోలీసు శాఖ, చిన్న కాం ట్రాక్టర్ల బకాయిలను చెల్లించాలని నిర్ణయించారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ మీడియాతో మాట్లాడుతూ.. సంక్రాంతి కానుకగా పెండింగ్‌ బిల్లులను చెల్లిస్తున్నామన్నా రు. గత వైసీపీ ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పులు, రూ.1.30 లక్షల కోట్ల పెండింగ్‌ బిల్లులను వదిలేసి వెళ్లిందని విమర్శించారు. ఈ క్రమంలో రూ.6,700 కోట్ల పెండింగ్‌ బిల్లు లు చెల్లించేందుకు ఆమోదించారని తెలిపా రు. దీనిలో ఉద్యోగులకు రూ.1300 కోట్లు విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. 26 వేల మంది చిన్న కాంట్రాక్టర్లకు ఊరట కలిగించే లా రూ.586 కోట్ల పెండింగ్‌ బిల్లులను విడుదల చేస్తున్నట్లు మంత్రి చెప్పారు.

వివిధ వర్గాలకు చెల్లింపులు ఇలా..

  • ఉద్యోగులకు జీపీఎఫ్‌- రూ.519 కోట్లు

  • పోలీసులకు ఒక విడత సరెండర్‌ లీవ్‌ బకాయిలు- రూ.214 కోట్లు

  • సీపీఎస్‌కు- రూ.300 కోట్లు

  • టీడీఎస్‌ చెల్లింపులకు- రూ.265 కోట్లు

  • 6.5 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌- రూ.788 కోట్లు

  • రూ.10 లక్షల్లోపు బిల్లులున్న చిన్న కాంట్రాక్టర్లకు- రూ.586 కోట్లు

  • అమరావతి రైతులు, గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణకు భూములిచ్చిన రైతులకు కౌలు బకాయిలు- రూ.241 కోట్లు

  • విద్యుత్‌ శాఖలో డిస్కమ్‌లకు- రూ.500 కోట్లు

  • కేంద్ర ప్రాయోజిత పథకాలకు- రూ.627 కోట్లు

  • ఎన్టీఆర్‌ వైద్యసేవ ట్రస్ట్‌కు- రూ.400 కోట్లు

  • ఔషధాలకు- రూ.100 కోట్లు

  • ఎంఎస్ఎంఈలకు- రూ.90 కోట్లు

  • వివిధ శాఖల్లో నిర్వహణ బిల్లులు- రూ.366 కోట్లు

Updated Date - Jan 12 , 2025 | 03:38 AM