Tirupati Stampede: నేను ఊరుకొన్న.. ఆయన వదిలి పెట్టడు.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 09 , 2025 | 06:31 PM
Tirupati Stampede: తిరుపతిలో తొక్కిసలాట నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. పలువురు ఉన్నతాధికారులపై ఆయన సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే పలువురిని బదిలీ చేశారు.
తిరుపతి, జనవరి 09: తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొంతమంది అధికారులు బాధ్యత లేకుండా పని చేయడం వల్లే.. తిరుపతిలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుందని ఆయన పేర్కొన్నారు. ఆ క్రమంలో డీఎస్పీ రమణకుమార్తోపాటు గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డిలను సస్పెండ్ చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. అలాగే ఎస్పీ సుబ్బారాయుడు, జేఈవో గౌతమీలపై బదిలీ వేటు వేస్తున్నామని తెలిపారు. తిరుపతి తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న క్షతగాత్రులను గురువారం సీఎం చంద్రబాబు పరామర్శించారు.
అనంతరం సీఎం చంద్రబాబు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ ఘటనపై జ్యూడీషియల్ విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. తిరుపతిలో బాధాకరమైన ఘటన చోటు చేసుకొందన్నారు. ఈ తొక్కిసలాట ఘటన తన మనస్సును కలచి వేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. తిరుమల పవిత్రత కాపాడే బాధ్యత అందరిపైన ఉందని స్పష్టం చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న క్షతగాత్రులను పరామర్శించానని ఆయన వివరించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతాని తెలిపారు. తిరుమల దివ్య క్షేత్రమని.. దాని పవిత్రతను కాపాడుతామని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు.
ఈ తొక్కిసలాట ఘటనపై ఈ రోజు కొన్ని నిర్ణయాలు తీసుకున్నామన్నారు. అలాగే ఉన్నతాధికారులకు కొన్ని సూచనలు సైతం చేశామని చెప్పారు. తిరుపతిలో రాజకీయాలు చేసేందుకు వీలు లేదని ఈ సందర్బంగా ఆయన కుండ బద్దలు కొట్టారు. ఇలాంటి ఘటనలు జరగ కూడదని ఓ భక్తుడిగా తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. తెలిసి చేసినా.. తెలియక చేసినా తప్పు తప్పేనని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అనాలోచిత నిర్ణయాలతో దేవుడిని అప్రతిష్టపాలు చేయొద్దని ఈ సందర్భంగా ప్రజలకు ఆయన సూచించారు.
Also Read: తిరుపతి తొక్కిసలాటలో క్షతగాత్రులు కొరిందదే.. ఒప్పుకొన్న సీఎం చంద్రబాబు
Also Read: హస్తిన పీఠం కోసం .. బీజేపీ స్కెచ్
Also Read: ప్రధాని మోదీ పర్యటన.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సంచలన వ్యాఖ్యలు
Also Read: జీహెచ్ఎంసీ ఎదుట మెరుపు ధర్నా.. కాంట్రాక్టర్ ఆత్మహత్యాయత్నం
ఈ తొక్కిసలాట ఘటనపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానన్నారు. అలాగే ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇక ఈ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు.. అదే విధంగా స్వల్ప గాయాలైన వారికి రూ. లక్ష చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు. ఈ ఘటనలో 33 మంది భక్తులకు గాయాలయ్యాయన్నారు. చికిత్స పొందుతున్న భక్తులందరికీ వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
For AndhraPradesh News And Telugu news