Andhra Pradesh: దారుణం.. ప్రియురాలి తండ్రి కళ్ళల్లో కారం కొట్టి మరీ..
ABN , Publish Date - Jan 07 , 2025 | 02:04 PM
ఏపీలో దారుణం చోటుచేసుకుంది. ప్రియురాలి తండ్రిని విచక్షణరహితంగా కత్తితో దాడి చేశాడు ఓ ప్రేమోన్మాది.
ఏలూరు జిల్లా : ప్రేమను నిరాకరిస్తున్నాడనీ ప్రియురాలి తండ్రిని కత్తితో దాడి చేసాడు ఓ ప్రేమోన్మాది. ఈ దారుణమైన ఘటన నూజివీడులో చోటుచేసుకుంది. నూజివీడు కృష్ణావిలాస్ కాలనీకి చెందిన యువతి తండ్రి సాంబశివరావు కళ్ళల్లో కారం కొట్టి మెడపై కత్తితో దాడి చేసి యువకుడు జుట్రూ బాబీ పరారైయ్యాడు.
గత కొంతకాలంగా సాంబశివరావు కుమార్తెను ప్రేమిస్తున్నానంటూ వెంటబడుతూ నిందుతుడు బాబీ వేధిస్తున్నట్లు తెలుస్తోంది. తమ కూతురును ప్రేమ పేరుతో ఇబ్బందిపెడుతున్నాడని యువకుడు బాబీపై యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తనపై కేసు పెట్టారనే కక్షతో ఇంట్లో నుండి బయటకు వస్తున్న యువతి తండ్రి సాంబశివరావుపై విచక్షణరహితంగా కత్తితో దాడి చేశాడు యువకుడు బాబీ. తీవ్రగాయాలతో ఉన్న సాంబశివరావును చికిత్స నిమిత్తం వెంటనే కుటుంబసభ్యులు నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.