Share News

DCCB: డీసీసీబీల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

ABN , Publish Date - Jan 16 , 2025 | 05:54 AM

గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం, కర్నూలు డీసీసీబీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ మేనేజర్‌, స్టాఫ్‌ అసిస్టెంట్‌/క్లర్క్‌ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. వివరాలను ఆప్కాబ్‌ తన వెబ్‌సైట్‌లో ప్రకటించింది.

DCCB: డీసీసీబీల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

  • 50 అసిస్టెంట్‌ మేనేజర్‌, 201 స్టాఫ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు నోటిఫికేషన్‌

అమరావతి, జనవరి15(ఆంధ్రజ్యోతి): గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం, కర్నూలు డీసీసీబీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ మేనేజర్‌, స్టాఫ్‌ అసిస్టెంట్‌/క్లర్క్‌ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. వివరాలను ఆప్కాబ్‌ తన వెబ్‌సైట్‌లో ప్రకటించింది. ఈనెల 22లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరిలో ఆన్‌లైన్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. గుంటూరు డీసీసీబీలో 31 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు, 50 స్టాఫ్‌ అసిస్టెంట్‌ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది.


స్టాఫ్‌ అసిస్టెంట్‌ పోస్టుల్లో పీఏసీఎస్‌ ఇన్‌సర్వీస్‌ ఉద్యోగులకు 13 రిజర్వ్‌ అయ్యాయి. శ్రీకాకుళం డీసీసీబీలో 19 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు, 35 స్టాఫ్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీలు చూపగా పీఏసీఎస్‌ ఉద్యోగులకు 9 స్టాఫ్‌ అసిస్టెంట్‌ పోస్టులు కేటాయించారు. కృష్ణా జిల్లా డీసీసీబీలో 66 స్టాఫ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 17 పీఏసీఎస్‌ ఇన్‌సర్వీస్‌ ఉద్యోగులకు కేటాయించగా, కర్నూలు డీసీసీబీలో 50 స్టాఫ్‌ అసిస్టెంట్‌ పోస్టుల్లో పీఏసీఎస్‌ ఇన్‌సర్వీస్‌ ఉద్యోగులకు 13 పోస్టులు కేటాయించారు.

Updated Date - Jan 16 , 2025 | 05:54 AM