సత్యదేవుడి సన్నిధిలో ప్రసాద్‌స్కీం పనులకు మరో ముందడుగు
ABN , Publish Date - Jan 22 , 2025 | 12:34 AM
అన్నవరం, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): సత్యదేవుడి సన్నిధిలో గడిచిన తొమ్మిదేళ్లగా ఊరిస్తూ వస్తున్న కేంద్రప్రభుత్వ పథకం ప్రసాద్ స్కీం పనులకు మరో ముందడుగు పడింది. సుమారు రూ.25.32 కోట్లతో అన్నదానభవనం, క్యూ కాంప్లెక్స్, రిటైనింగ్ వాల్, మరుగుదొడ్లు, ఎలక్ట్రికల్ బస్సులు, చార్జింగ్‌స్టే

అన్నవరం, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): సత్యదేవుడి సన్నిధిలో గడిచిన తొమ్మిదేళ్లగా ఊరిస్తూ వస్తున్న కేంద్రప్రభుత్వ పథకం ప్రసాద్ స్కీం పనులకు మరో ముందడుగు పడింది. సుమారు రూ.25.32 కోట్లతో అన్నదానభవనం, క్యూ కాంప్లెక్స్, రిటైనింగ్ వాల్, మరుగుదొడ్లు, ఎలక్ట్రికల్ బస్సులు, చార్జింగ్‌స్టేషన్లకు సార్వత్రిక ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అయితే ఎన్నికలు ముగిసి ఆరునెలలు గడిచినా పనులు ప్రారంభంకాలేదు. ఒక పర్యాయం టెండర్లు పిలిచి తరువాత టెండర్లను టూరిజంశాఖ రద్దు చేసింది. తిరిగి ఈనెల 9వతేదీన మరోసారి టెండర్లు పిలవగా 24వతేదీన టెండర్లు తెరవనున్నారు. తెరిచిన నెలరోజుల్లో పనులు ప్రారంభించడం జరుగుతుందని టూరిజం అధికారులు తెలిపారు. ఈమేరకు మంగళవారం దేవస్థానం ఈవో సుబ్బారావు, చైర్మన్ రోహిత్‌లతో ఆర్కిటెక్చర్స్ టి.బాలకృష్ణ, శ్రీనివాస్, టూరిజం ఏఈఈ వెంకటేష్ చర్చించి అన్నదాన భవనం నిర్మించబోయే టీటీడీ సత్రం స్థలాన్ని దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రధానంగా ప్రసాద్‌స్కీం ద్వారా నిర్మించబోయే అన్నదాన భవనం కోసం ఎదురుచూస్తున్నామని, ప్రస్తుతం అన్నదానభవనం పూర్తిస్థాయిలో భక్తులకు సరిపోవడం లేదని వారికి వివరించగా నెలరోజుల్లో పనులు ప్రారంభమవుతాయని టూరిజం అధికారులు వివరించారు. కార్యక్రమంలో దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులు వి.రామకృష్ణ, నూకరత్నం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.