Share News

మారుతున్న రత్నగిరి రూపురేఖలు

ABN , Publish Date - Feb 26 , 2025 | 12:45 AM

అన్నవరం, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో అన్నవరం దేవస్థానం ఆఖరిస్థానం రావడం పరిస్థితులు మెరుగు కోసం ప్రభుత్వ పెద్దల సూచనతో సోమవారం స్వీయపర్యవేక్షణ చేయడంతో క్రమేపీ రూపురేఖలు మారుతున్నాయి. ముందుగా గతకొంతకాలంగా నిరుపయోగం

మారుతున్న రత్నగిరి రూపురేఖలు
మరుగుదొడ్లను శుభ్రపరుస్తున్న శానిటేషన్‌ సిబ్బంది

అన్నవరం, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో అన్నవరం దేవస్థానం ఆఖరిస్థానం రావడం పరిస్థితులు మెరుగు కోసం ప్రభుత్వ పెద్దల సూచనతో సోమవారం స్వీయపర్యవేక్షణ చేయడంతో క్రమేపీ రూపురేఖలు మారుతున్నాయి. ముందుగా గతకొంతకాలంగా నిరుపయోగంగా ఉన్న హరిహరసదన్‌ కాటేజీ పక్కనే ఉన్న మరుగుదొడ్లను శానిటేషన్‌ సిబ్బంది శుభ్రపరిచారు. సీఆర్వో కార్యాలయం వద్ద నగదురహిత సేవలను మంగళవారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు. అన్నప్రసాదం స్వీకరించే భక్తులు వేచిఉండకుండా బఫే విధానం అమలుచేయాలనే కాకినాడ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో ఈవో వీర్ల సుబ్బారావు ప్రస్తుత భవన పైఅంతస్తు పరిశీలించి త్వరితగతిన అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ద ళారీ వ్యవస్థను అరికట్టేందుకు సెక్యూరిటీ విభాగం సూపరింటెండెంట్‌ ఐవీ రామారావు సెక్యూరిటీ సి బ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రోటోకాల్‌ పరిధిలో ఉన్నవారికి మాత్రమే ప్రత్యేక క్యూ ద్వారా పంపించాలని, కిందిస్థాయి సిబ్బందిఎవ్వరు తీసుకొచ్చిన తూర్పురాజగోపురం నుంచే పంపించాలని అడ్డదిడ్డంగా పంపకుండా చూడాలని ఆదేశించారు.

నేడు సరస్వతీ పూజ

త్వరలో జరిగే ఇంటర్‌, పదవ తరగతి, ఇతర ముఖ్య పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఉత్త మశ్రేణిలో ఉత్తీర్ణత సాధించాలనే ఆకాంక్షతో బుధవారం అన్నవరం దేవస్థానంలో సరస్వతీ పూజ నిర్వహించనున్నట్టు ఈవో వీర్ల సుబ్బారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు నిత్య కల్యాణమండపంలో జరిగే ఈ కార్యక్రమంలో సరస్వతీపూజ అనంతరం స్వా మిచెంతన ఉంచిన కలములు ఉచితంగా బహూకరించనున్నారు. అనంత రం వారికి సత్యదేవుడి ప్రత్యేకదర్శనం, అన్నదాన విభాగంలో ఉచిత అన్నప్రసాద సౌకర్యం కల్పించా మని, విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు.

Updated Date - Feb 26 , 2025 | 12:45 AM