Share News

జగ్గన్నతోట ప్రభల ఉత్సవానికి మరోసారి కేంద్రం గర్తింపు

ABN , Publish Date - Jan 13 , 2025 | 01:09 AM

అంబాజీపేట, జనవరి 12(ఆంధ్రజ్యోతి): ప్రపంచం నలుమూలలకు విస్తరించిన జగ్గన్నతోట ఏకాదశ రుద్రుల ప్రభల ఉత్సవాన్ని మరోసారి కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉత్సవ్‌ విభాగంలోని వెబ్‌సైటులో చోటు కల్పించింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారం గ్రామానికి చెందిన శివకేశవయూత్‌ సభ్యులు 450 ఏళ్లచరిత్ర కలిగిన జగ్గన్నతోట ఏకా

జగ్గన్నతోట ప్రభల ఉత్సవానికి మరోసారి కేంద్రం గర్తింపు

కేంద్ర పర్యాటక వెబ్‌సైటులో ఏకాదశ రుద్రుల ఉత్సవం

అంబాజీపేట, జనవరి 12(ఆంధ్రజ్యోతి): ప్రపంచం నలుమూలలకు విస్తరించిన జగ్గన్నతోట ఏకాదశ రుద్రుల ప్రభల ఉత్సవాన్ని మరోసారి కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉత్సవ్‌ విభాగంలోని వెబ్‌సైటులో చోటు కల్పించింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారం గ్రామానికి చెందిన శివకేశవయూత్‌ సభ్యులు 450 ఏళ్లచరిత్ర కలిగిన జగ్గన్నతోట ఏకాదశ రుద్రుల ప్రాశస్యాన్ని చర్రితను వివరిస్తూ కేంద్ర ప్రభుత్వ పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ లేఖరాశారు. దీంతో కేంద్ర పర్యాటక శాఖమంత్రిత్వ శాఖ ఉత్సవ నిర్వహణ, 11 ఏకాదశ రుద్రుల ప్రభల రూపాలు, గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారం గ్రామాల రుద్రుల ప్రభలు పచ్చనిచేలను తొక్కుకుంటూ అప్పర్‌ కౌశిక దాటే దృశ్యాలు, ఉత్సవాన్ని తిలకించేందుకు జగ్గన్నతోటకు వచ్చేలక్షలాది జనం తదితర అం శాలను పరిశీలించారు. ఈ మేరకు శనివారం అర్ధరాత్రి కేంద్ర పర్యాటక శాఖ వెబ్‌సైట్‌లో చోటు కల్పించారు. కేంద్ర పండుగల జాబితాలో కేంద్ర ప్రభుత్వం చేర్చింది. ఇప్పటికే శివకేశవయూత్‌ సభ్యులు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాయడంతో ఆయన స్పందించి 2020లో ఏకా దశ రుద్రుల ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రతిలేఖను రాశారు. అలాగే 2023 జనవరి 26వ ఢిల్లీలో జరిగిన రిప్లబిక్‌ డే వేడుకల్లో ఆంధ్రప్రదేశ్‌ తరుపున జగ్గన్నతోట ఏకాదశ రుద్రుల థీమ్‌ను ప్రత్యేకంగా శకటంగా రూపొందించి ప్రదర్శించారు. దీంతో దేశ విదేశాల్లో జగ్గన్నతోట మరింత విస్తరించింది. తాజాగా కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వెబ్‌సైటులో చోటు కల్పించడంతో 11 గ్రామాల ప్రజ లు, గంగలకుర్రు అగ్రహారం శివకేశవయూత్‌ స భ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో జగ్గన్నతోట ప్రభల ఉత్సవాన్ని కేంద్ర, రాష్ట్రపండుగగా నిర్వహించాలని కోరుతున్నారు.

Updated Date - Jan 13 , 2025 | 01:09 AM