Share News

వినోదంలో...విషాదం

ABN , Publish Date - Jan 02 , 2025 | 01:02 AM

సర్పవరం జంక్షన్‌ (కాకినాడ), జనవరి 1 (ఆంధ్రజ్యోతి): పర్యాటక విహార కేంద్రంగా ప్రసిద్ధి చెందిన కాకినాడ ఎన్టీఆర్‌ బీచ్‌ సం దర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతూనే... మరోవైపు ఆహ్లాదం మా టున ప్రమాదం పొంచి ఉన్న కడలి మృత్యు కెరటాలకు యువకులు బలవుతున్నారు. కొత్త సంవత్సరం వేళ స్నేహితులతో కలసి ఆనందోత్సాహాలతో బీచ్‌కు వచ్చిన యువకులు సముద్ర స్నానానికి దిగి కెరటాల ఉధృతికి గల్లంతైన 2 వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు ఇంటర్‌

వినోదంలో...విషాదం
ఎన్టీఆర్‌ బీచ్‌లో మృతిచెందిన పీఆర్‌ కాలేజ్‌ విద్యార్థి నాగసాయి

నూతన సంవత్సరం వేళ

ఎన్టీఆర్‌ బీచ్‌లో బాధాకరమైన ఘటనలు

సముద్రంలోకి స్నానానికి దిగిన విద్యార్థుల మృతి

రెండు వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు

ఇంటర్‌ విద్యార్థుల మరణం, మరొకరు గల్లంతు

సర్పవరం జంక్షన్‌ (కాకినాడ), జనవరి 1 (ఆంధ్రజ్యోతి): పర్యాటక విహార కేంద్రంగా ప్రసిద్ధి చెందిన కాకినాడ ఎన్టీఆర్‌ బీచ్‌ సం దర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతూనే... మరోవైపు ఆహ్లాదం మా టున ప్రమాదం పొంచి ఉన్న కడలి మృత్యు కెరటాలకు యువకులు బలవుతున్నారు. కొత్త సంవత్సరం వేళ స్నేహితులతో కలసి ఆనందోత్సాహాలతో బీచ్‌కు వచ్చిన యువకులు సముద్ర స్నానానికి దిగి కెరటాల ఉధృతికి గల్లంతైన 2 వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు ఇంటర్‌ విద్యార్థులు మృతి చెందగా, మరొక యువకుడు గల్లంతైన సంఘటన ఎన్టీఆర్‌ ఓల్డ్‌ బీచ్‌లో బుధవారం సాయంత్రం జరి గాయి. వివరాల్లో కెళితే కొత్తపల్లి మండలం కోనపాపపేట శివారు మల్లివారితోటకు చెందిన గుత్తుర్తి సతీష్‌కుమార్‌ (17) కాకినాడ ఆదిత్య జూనియర్‌ కాలేజీలో హాస్టల్లో ఉంటూ ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యనభ్యసిస్తున్నాడు. కొత్త సంవత్సరం కావడంతో కాలేజీ నుంచి విహార యాత్ర (ఔటింగ్‌)కి వెళ్లేందుకు కాలేజీ అనుమతి ఇచ్చింది. దాంతో విద్యార్థులతో కలసి బుధవారం కాకినాడ రూరల్‌ మండలం సూర్యారావుపేట ఎన్టీఆర్‌ బీచ్‌కు వచ్చా రు. అక్కడ కాసేపు ఆనందంగా గడిపిన తర్వాత ఓల్డ్‌ ఎన్టీఆర్‌ బీచ్‌లో సముద్ర స్నానాలు చేసేందుకు దిగారు. సముద్ర కెరటాల ఉధృతికి సతీష్‌కుమార్‌ గల్లంతయ్యాడు. అనంతరం మృతదేహం ఒడ్డుకు కొట్టుకు వచ్చింది.

మరో సంఘటనలో...కాకినాడ రామకృష్ణారావుపేట ఎర్రరోడ్డుకు చెందిన వడిసెల గౌరీ లక్ష్మీ నాగసాయి (16), బొర్ర శ్రీనుబాబు మరో ముగ్గురు మొత్తం ఐదుగురు స్నేహితులతో కలసి సూర్యారావుపేట బీచ్‌కు వచ్చారు. అక్కడ కాసేపు ఆనందంగా గడిపిన తర్వాత సముద్రంలో స్నానానికి దిగారు. లక్ష్మీనాగసాయి, బొర్రా శ్రీనుబాబులు కెరటాల్లో పడగా లక్ష్మీనాగసాయి మృతిచెందాడు. మృతుడు కాకినాడ పీఆర్‌ కాలేజీలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శ్రీనుబాబు సముద్రంలో గల్లంతయ్యాడు. ఈ విషయాన్ని స్నేహితులు వారి కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించగా తిమ్మాపురం ఎస్‌ఐ ఎంవీవీ రవీంద్రబాబు సిబ్బందితో కలసి సంఘటనా స్థలానికి చేరుకుని రెండు మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌ కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. గల్లంతైన యువకుడి కోసం మత్స్యకారులతో గాలింపు చేపట్టినట్టు ఎస్‌ఐ తెలిపారు. రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు విద్యార్థులు మృతిచెందగా, ఒకరు గల్లంతయ్యారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. తమ కుమారుడు ఔటింగ్‌కి వెళ్లినట్లు కాలేజీ సిబ్బంది ఉదయం ఫోన్‌ చేసి చెప్పారని, తర్వాత సాయంత్రం 4.30 గంటలకు చనిపోయినట్లు సమాచారం చెప్పారని సతీష్‌కుమార్‌ తండ్రి లక్ష్మీనారాయణ కన్నీరుమున్నీరుగా విలపించాడు. తన సమ్మతి తీసుకోకుండానే ఔటింగ్‌కు పంపించారని ఆరోపించారు. తమకు సమాచారం ఇవ్వకుండా కుమారుడు మృతదేహాన్ని మార్చురీకి తరలించినందుకు వ్యతిరేకంగా కాలేజీ వద్ద కుటుంబ సభ్యులతో ధర్నా నిర్వహించారు. ఈ విషయమై తమ కు న్యాయం చేయాలని ఆందోళన చేశారు.

Updated Date - Jan 02 , 2025 | 01:02 AM